India Vs England: లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్-భారత్ జట్ల (India Vs England) మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఇంగ్లిష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు రాబడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఓవర్ నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగవ రోజు ఆరంభమయ్యింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ మరో 2 పరుగులు మాత్రమే సాధించి వ్యక్తిగత స్కోరు 8 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌తో కలిసి కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ సెంచరీ నమోదు చేశారు.
భారత్ రెండో ఇన్నింగ్స్ రెండవ సెషన్‌లో 74 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 297/4 గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ 119 (బ్యాటింగ్), కరుణ్ నాయర్ 4(బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఈ ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ సాధించాడు. శతకం తర్వాత వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో, వ్యక్తిగత స్కోరు 118 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌కు ఇది రెండవ సెంచరీ. తొలి ఇన్నింగ్స్‌లో కూడా శతకం బాదిన విషయం తెలిసిందే. రెండవ ఇన్నింగ్స్ 118 పరుగులు సాధించడానికి కేవలం 140 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇక కేఎల్ రాహుల్ 14 ఫోర్లు బాదాడు.
రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిండన్ కార్సే 2 వికెట్లు పడగొట్టాడు. షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీశారు.
Read this- Soul Of Maargan: విజయ్ ఆంటోనీ ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేసి.. ప్లాన్ మార్చాడు!
రిషబ్ పంత్ రికార్డు
తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్.. టీమిండియా తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన ఏడవ ఇండియన్ క్రికెటర్‌గా రిషబ్ పంత్ రికార్డు సాధించాడు. పంత్ కంటే ముందు విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ (3 సార్లు), రాహుల్ ద్రవిడ్ (2 సార్లు), విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ ఈ ఘనత సాధించారు. ఇక, ఇంగ్లండ్‌లో ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన తొలి క్రికెట్ రిషబ్ పంత్ మరో రికార్డుగా నమోదయింది. లీడ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 134 పరుగులు సాధించిన ఔట్ అయిన విషయం తెలిసిందే.
ఒక టెస్టు మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు సాధించిన ప్లేయర్ రిషబ్ పంత్ నిలిచాడు. పంత్ కంటే ముందు జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్ 2001లో దక్షిణాఫ్రికాపై ఈ ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 142 పరుగులు, రెండవ ఇన్నింగ్స్‌లో 199 (నాటౌట్) సెంచరీలు సాధించాడు.
Read this- Electric Aircraft: ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..