Soul Of Maargan: విజయ్ ఆంటోనీ ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేశారు
Vijay Antony
ఎంటర్‌టైన్‌మెంట్

Soul Of Maargan: విజయ్ ఆంటోనీ ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేసి.. ప్లాన్ మార్చాడు!

Soul Of Maargan: విజయ్ ఆంటోని.. హీరోగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా తనకున్న మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకులలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ‘బిచ్చగాడు’ సినిమా తర్వాత ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం బాగా దగ్గరయ్యారు. అప్పటి నుంచి ఆయన నటిస్తున్న సినిమాలన్నీ తెలుగులోనూ విడుదలవుతున్నాయి. అయితే ‘బిచ్చగాడు’ తర్వాత ఆయనకు మళ్లీ అటువంటి హిట్ పడలేదనే చెప్పుకోవాలి. మంచి కంటెంట్‌తో సినిమాలైతే ఆయన చేస్తున్నాడు కానీ, సక్సెస్ ‌ఫుల్ చిత్రాలు అవి బయటపడటం లేదు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తన సత్తా చాటేందుకు ‘మార్గన్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విజయ్ ఆంటోని (Vijay Antony). ‘మార్గన్’ (Maargan) చిత్రం జూన్ 27న ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ పాటను మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Mani Ratnam: మణిరత్నం సారీ చెప్పేశారు.. నెక్ట్స్ ఇచ్చిపడేస్తారట!

ఈ పాట విషయానికి వస్తే.. ‘చెప్పలేని ద్వేషముందే జగతిపై’ అంటూ సాగే ఈ ‘సోల్ ఆఫ్ మార్గన్’ సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్‌ను ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. భాష్య శ్రీ రచించిన ఈ పాటను అక్షర ఆలపించారు. విజయ్ ఆంటోనీ బాణీ వెంటాడేలా, సినిమా థీమ్‌ను చాటి చెప్పేలా ఉంది. అయితే ఈ థీమ్ పాటతో విజయ్ ఆంటోని ఎప్పటి నుంచి వస్తున్న తన సెంటిమెంట్‌‌ని పక్కన పెట్టేశారు. ఏంటా? సెంటిమెంట్ అంటే.. నార్మల్‌గా విజయ్ ఆంటోని నుంచి ఏ సినిమా వస్తున్నా.. విడుదలకు 10 రోజుల ముందు 10 నుంచి 15 నిమిషాల నిడివి ఉన్న సినిమాను ముందుగనే రిలీజ్ చేసేవారు. చాలా సినిమా నుంచి ఆయన ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ కంటెంట్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో నమ్మకం పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం. అలాంటి సెంటిమెంట్‌ను పక్కన పెట్టి, కొత్త ప్లాన్ అన్నట్లుగా ‘సోల్ ఆఫ్ మార్గన్’ పేరుతో సినిమాలోని కొన్ని కీలక పాయింట్స్‌ను రివీల్ చేశారు.

Also Read- Kuberaa: ‘కుబేర’ సినిమా కొత్త రికార్డ్.. మొదటి రోజు కంటే మూడో రోజే షాకింగ్ కలెక్షన్స్?

మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వెయిట్ చేయాలి. విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జె. రామాంజనేయులు సమర్పిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ తదితరులు నటించిన ఈ చిత్రానికి యువ.ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం సమకూర్చగా.. రాజా. ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..