Kuberaa: నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ (Love Story) సినిమా తర్వాత శేఖర్ కమ్ముల (Sekhar Kammula) డైరక్షన్లో ‘కుబేర’ (Kuberaa) మూవీ జూన్ 20న విడుదలైంది. ధనుష్ (Dhanush) హీరోగా నటించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున దీపక్ అనే ముఖ్య పాత్ర పోషించాడు. ధనుష్ (Dhanush) కెరీర్లో ఇలాంటి పాత్ర పోషించ లేదు.నిజం చెప్పాలంటే.. బిచ్చగాడి పాత్ర అదరగొట్టాడు. ఇక నాగార్జున (Nagarjuna) అయితే సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేశాడనే చెప్పుకోవాలి. ‘ఏషియన్ సినిమా సినిమాస్’, ‘అమిగోస్ క్రియేషన్స్’ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల కలిసి ఈ సినిమాని నిర్మించారు.
Also Read: Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్
ఎవ్వరూ ఊహించని విధంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ కూడాఅదిరిపోయాయి. ఫస్ట్ డే , సెకండ్ డే కలెక్ట్ చేసినప్పటికి ఈ మూవీ .. మూడో రోజు దానికి మించి కలెక్ట్ చేసింది. అయితే, మొదటి వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే..
సీడెడ్ – 2.6 cr
ఉత్తరాంధ్ర – 3.09 cr
ఈస్ట్ – 1.52 cr
వెస్ట్ – 1.03 cr
గుంటూరు – 1.42 cr
కృష్ణా- 1.41 cr
నెల్లూరు – 0.83 cr
ఏపీ+తెలంగాణ – 20.82 cr (షేర్)
తమిళనాడు – 5.8 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా – 3.82 cr
ఓవర్సీస్ – 12.95 cr
వరల్డ్ టోటల్ – 43.39 cr (షేర్)
Also Read: Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?
కుబేర'(Kuberaa) సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.60 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.43.39 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గ్రాస్ పరంగా రూ.66.5 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ రీచ్ అవ్వాలంటే ఇంకో రూ.16.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Also Read: Star Comedian: స్నానం చేయక చేతికి గజ్జి వచ్చిందంటూ.. ఎమోషనల్ అయిన స్టార్ కమెడియన్