Ekashila Plot Owners( image credit: swetcha reporter)
హైదరాబాద్

Ekashila Plot Owners: అక్రమ నిర్మాణాల కూల్చివేతపై.. హైడ్రా దూకుడు!

Ekashila Plot Owners: పోచారం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా (Hydra) దూకుడు పెంచింది. ఇటీవల దివ్యానగర్ లో భారీ ప్రహరీ గోడ నిర్మాణం కూల్చివేసింది. కాగా  ఉదయం కొర్రెముల ఏకశిలా నగర్ (Ekashila Nagar) లో సర్వే నెంబర్ 740, 741, 742 లో 7.16 ఎకరాల భూమి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చి వేశారు. ఏకశిలా వెంచర్ లో తప్పుడు పత్రాలు సృష్టించి వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేయించారని, తమకు న్యాయం చేయాలంటూ ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల హైడ్రా కమిషనర్ (Hydra Commissioner)ను కలిసి కోరారు.

 Also Read: Hormuz Closure Impact: సామాన్యులకు షాక్.. భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు.. కారణాలివే!

7.16 ఎకరాల అర్బన్ సీలింగ్ ల్యాండ్

ఈ మేరకు హైడ్రా (Hydra) బృందం ఏకశిల వెంచర్ లో 7 ఎకరాల చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను కూల్చివేశారు. దీంతో ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే హైడ్రాధికారులు ఎలాంటి రికార్డులు పరిశీలించకుండానే తమ వ్యవసాయ భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారని భూ యజమాని నూనె వెంకటనారాయణ పేర్కొంటున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. 740, 741, 742 సర్వే నంబర్ల లో 7.16 ఎకరాల అర్బన్ సీలింగ్ ల్యాండ్ ను ప్రభుత్వం ద్వారా పట్టేదారులు రెగ్యులరైజ్ చేసుకున్నారని, ఆ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేశామని చెప్పారు.

Also ReadBJP MP Kishan Reddy: బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం వెనుకబడింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు