USA Advisory: భారత్‌కు వెళ్లే అమెరికన్ పౌరులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం హెచ్చరించింది. భారత్‌లో ఉగ్రవాదం, నక్సలిజం, అత్యాచారాలు, పౌర నిరసనలను పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా, భారత్ వెళ్లే ఒంటరి మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు జూన్ 16న అమెరికా విదేశాంగ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది. భారతదేశానికి లెవల్-2 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేస్తున్నట్టు పేర్కొంది. నేరాలు, ఉగ్రవాదుల ముప్పు కారణంగా అప్రమత్తంగా ఉండాలని, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో భద్రతా సమస్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి. పర్యాటక, ఇతర ప్రదేశాలలో లైంగిక వేధింపులతో పాటు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. మార్కెట్లు, రవాణా కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ భవనాల లాంటి ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకొని ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే దాడులకు పాల్పడవచ్చు’’ అని తీవ్రంగా హెచ్చరించింది.
Read this- Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం
ఉత్తర తెలంగాణ వెళ్లొద్దు
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని అమెరికా పౌరులు ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఉంటే సహాయం అందించే వెసులుబాటు, సామర్థ్యం ప్రభుత్వానికి పరిమితంగా ఉన్నాయని ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ పశ్చిమ బెంగాల్ వరకు ఈ తరహా ప్రాంతాలు ఉన్నాయని పేర్కొంది. భద్రతా ప్రమాదాల రీత్యా, అమెరికా ప్రభుత్వ సిబ్బంది ఈ ప్రదేశాలకు వెళ్లాలంటే ముందగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని పేర్కొంది. భారత్ వెళ్లే అమెరికా పర్యాటకులు కూడా మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. భారత్‌లో అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాల జాబితాలో జమ్మూ కశ్మీర్, పాక్ సరిహద్దు ప్రాంతం, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మేఘాలయ, ఒడిశా రాష్ట్రాల రాజధానులకు వెళ్తే ఫరవాలేదని, కానీ, ఈ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లొద్దని అడ్వైజరీ అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
Read this- Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తులో కీలక పరిణామం
ఈ పరికరాలు తీసుకెళ్లొద్దు
ఇండియా వెళ్లే యూఎస్ పౌరులు సూచించిన కొన్ని పరికరాలను తీసుకెళ్లవొద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. శాటిలైట్ ఫోన్, జీపీఎస్ పరికరాలను వెంట తీసుకెళ్లొద్దని పేర్కొంది. చట్టవిరుద్ధంగా ఈ పరికరాలను భారత్‌లో వినియోగిస్తే ఏకంగా 200,000 డాలర్ల జరిమానా లేదా మూడేళ్ల వరకు జైలు పడుతుందని అడ్వైజరీలో హెచ్చరించింది. జమ్మూ-కాశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని ప్రాంతాలు, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని వివరించింది. ఇమ్మిగ్రేషన్ ఇబ్బందులు, జరిమానాలు, ఇతర ప్రమాదాల కారణంగా ప్రయాణికులు భారత్-నేపాల్ సరిహద్దు నుంచి భూమార్గం ద్వారా ప్రయాణించవద్దని హెచ్చరించారు. మణిపూర్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లినప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రాంతాలలో కొనసాగుతున్న భద్రతా సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.
Read this- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్రేజీ స్టార్స్.. రచ్చ చేయడానికి కాంట్రవర్సీ భామలు?