Rishabh Pant: లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్, పర్యాటక భారత్ జట్ల మధ్య (England Vs India 1st Test) తొలి టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆట రసవత్తరంగా కొనసాగుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 359/3 వద్ద భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఇద్దరూ కొద్దిసేపు అద్భుతంగా రాణించారు. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 127 పరుగులకు మరో 20 రన్స్ జోడించిన గిల్, వ్యక్తిగత స్కోర్ 147 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో జాష్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు.
మరో ఎండ్‌లో, ఇంగ్లండ్ బౌలర్లపై రిషబ్ పంత్ విరుచుకుపడ్డాడు. వన్డే తరహా స్టైల్‌లో బ్యాటింగ్ చేశాడు. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోర్ 65 వద్ద బ్యాటింగ్ మొదలుపెట్టిన అతడు సిక్సులు, ఫోర్లతో వేగంగా పరుగుల రాబట్టాడు. 99 పరుగుల వద్ద అద్భుతమైన సిక్సర్ బాది అదిరిపోయే రేంజ్‌లో సెంచరీని అందుకున్నాడు. ఆ తర్వాత అంతే వేగంగా ఆడినప్పటికీ, వ్యక్తిగత స్కోరు 134 పరుగుల (178 బంతుల్లో) వద్ద జాష్ టంగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీనినిబట్టి పంత్ ఎంత వేగంగా ఆడాడో అర్థం చేసుకోవచ్చు.
Read this- Snake in Metro: మెట్రో లేడీస్ కోచ్‌లోకి పాము?.. వీడియో చూస్తే..
ఎంఎస్ ధోనీ రికార్డులు బ్రేక్
టెస్టు ఫార్మాట్‌లో అత్యధికంగా ఏడు సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయ క్రికెటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. 6 సెంచరీలు సాధించిన దిగ్గజ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ రెండవ స్థానానికి పరిమితమయ్యాడు. 3 సెంచరీలతో వృద్ధిమాన్ సాహా మూడవ స్థానంలో ఉన్నారు. ఇక, ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు కొట్టిన పంత్, టెస్టుల్లో అతడి మొత్తం సిక్సర్ల సంఖ్యను 79కి పెంచుకున్నాడు. దీంతో, టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పంత్ టాప్-3కి దూసుకెళ్లాడు. 78 సిక్సర్లు సాధించిన ఎంఎస్ ధోనీ 4వ స్థానానికి దిగజారాడు. ఇక, వీరేందర్ సెహ్వాగ్ (90 సిక్సర్లు), రోహిత్ శర్మ (88 సిక్సర్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
లంచ్ బ్రేక్‌కు ఇదీ స్కోర్
రెండవ రోజు ఆట మొదటి సెషన్ ముగిసింది. దీంతో, లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 454/7గా ఉంది. గిల్, రిషబ్ పంత్ కొద్దిసేపు ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాటర్లు తేలిపోయారు. కరుణ్ నాయర్ డకౌట్ అవ్వగా, శార్ధూల్ థాకూర్ 1 పరుగుకే ఔటయ్యాడు. ప్రస్తుతం రవీంద్ర జడేజా 2 (బ్యాటింగ్), జస్ప్రీత్ బుమ్రా 0 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్స్ స్టోక్స్ 4 వికెట్లు, షోయబ్ బషీర్, జాష్ టంగ్, బ్రీడన్ కర్సీ తలో వికెట్ పడగొట్టారు.
Read this- Viral News: కోడలు పారిపోయిందన్నారు.. దర్యాప్తులో సంచలనం!
జైస్వాల్, గిల్, పంత్ రికార్డు
ఆసియా ఖండం అవతల భారత్ జట్టు ఆడిన ఓ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇది నాలుగోసారి. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ శతకాలు సాధించడంతో ఈ రికార్డు సాధ్యమైంది. వీరి ముగ్గురి కంటే ముందు మూడు సార్లు ఈ అరుదైన ఫీట్ నమోదయింది.
1. గవాస్కర్, శ్రీకాంత్, మొహిందర్ 1986లో ఆస్ట్రేలియాపై శతకాలు (సిడ్నీ వేదిక).
2. ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ 2002లో ఇంగ్లండ్‌పై (హెడింగ్లీ).
3. సెహ్వాగ్, ద్రావిడ్, మహ్మద్ కైఫ్ 2006లో వెస్టిండీస్‌పై (గ్రాస్ ఐలెట్).
4. జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ 2025లో ఇంగ్లాండ్‌పై (హెడింగ్లీ).