GHMC RV Karnan: డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్.వి.కర్ణన్(RV karnan) నగర వాసులను కోరారు. కమిషనర్ ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరా పార్కుల(Indira Park) ను సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా వ్యాధికి గురికాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు. ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు దోమల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కవాడిగూడ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు విద్యార్థులకు కమిషనర్ వివరించారు.
యోగా షెడ్ వద్ద ఉన్న ప్లాస్టిక్
అనంతరం కమిషనర్ ఇందిరా పార్కును సందర్శించారు. అక్కడ వాకర్స్‌తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్ సమన్యలను పరిష్కరించాలని అర్బన్ బయోడైవర్శిటీ(urban biodiversity) అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ సందర్శకుల వసతుల కోసం కొన్ని సూచనలు చేశారు. ఓపెన్ జిమ్ వద్ద గుల్మొహర్ ట్రీ తొలగించాలన్నారు. గ్రీన్ వెస్ట్ రోజు వారీగా తొలగించాలని, పార్కు లోని అన్ని ఫౌంటెన్ లను రన్ చేయాలన్నారు. కుక్కలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఐరన్ స్క్రాప్‌ను వెంటనే తొలగించాలని, బట్టర్ ఫ్లై((Butterfly Park) పార్కును అభివృద్ధి చేసి పబ్లిక్ కోసం సిద్ధం చేయాలన్నారు. పార్కులో పలు ప్రాంతాల్లో వాటర్ లీకేజీ అవుతున్న దృష్ట్యా వాటిని ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో మరమ్మత్తులు చేసి, లీకేజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కు మొత్తం పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పార్కులోకి ప్లాస్టిక్(Plastic) వస్తువులు తీసుకురాకుండా నిరోధించాలన్నారు. పని చేయని ఫౌంటెన్ తొలగించాలని, యోగా(Yoga) షెడ్ వద్ద ఉన్న ప్లాస్టిక్ ఇతర చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సికిందరాబాద్ జోన్ జోనల్(Secunderabad Zone) కమిషనర్ రవి కిరణ్, డిప్యూటీ కమీషనర్ రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 మంజూరు చేయండి!
ట్యాక్స్ కలెక్షన్ చేయని వారిపై చర్యలు తీసుకోవాలి: కమిషనర్
ఆస్తిపన్ను(Tax Collection) వసూళ్లకు సంబంధించి ఇప్పటికే పెట్టుకున్న టార్గెట్ ప్రకారం ట్యాక్స్ కలెక్షన్ చేయాల్సిందేనని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ట్యాక్స్ సిబ్బందికి క్లారిటీ ఇచ్చారు. అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లతో ఆస్తిపన్ను వసూలు, ఫాగింగ్, పూడికతీత అంశాల పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బిల్ కలెక్టర్‌లకు నిర్దేశించిన లక్ష్యం మేరకు ట్యాక్స్ కలెక్షన్ తప్పని సరిగా చేయాలని అన్నారు. జోనల్ కమిషనర్ సర్కిల్ వారీగా సమీక్షించి నిర్దేశించిన లక్ష్యం మేరకు టాక్స్ వసూలు చేయని బిల్లు కలెక్టర్‌ల పై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు చేపట్టే ఫాగింగ్ పై పర్యవేక్షణకు ఒక వార్డు కు ఒక్క సూపర్ వైజర్ ను ఏర్పాటు చేయాలని, రెండు అంత కంటే ఎక్కువ వార్డులకు సూపర్ వైజర్లు నియమించవద్దని హెల్త్ అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు. జోనల్ సీనియర్ ఎంటరాలజిస్ట్ లకు ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు. పార్క్‌లలో దోమల వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయలన్నారు. డి-సిల్టింగ్‌లో కొన్ని సర్కిల్ వెనుకబడి ఉన్న ఈఈ లు, డిప్యూటీ ఈఈ లకు షోకాజు నోటీసులు జారిచేయాలని చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు.
Also Read: Chamala Kiran Kumar: హరీష్‌రావు కీలక స్కెచ్.. కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం