Gold Rate Today: గత కొంత కాలంగా పసిడి ధరల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకరోజు పసిడి ధర తగ్గిందనే సంతోష పడే లోపే మరుసటి రోజు అమాంతం పెరిగిపోతున్నాయి. పెరుగుతూ, తగ్గుతూ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ కూడా బంగారం ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంది. వీకెండ్ సందర్భంగా బంగారం కొనాలని ప్లాన్ చేసుకున్న వారికి ఇది పెద్ద షాకే అని చెప్పవచ్చు.
ధర ఎంత పెరిగిందంటే?
శుక్రవారంతో పోలిస్తే దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.250.. 24 క్యారెట్ల పసిడి రూ.270 మేర పెరిగింది. ఫలితంగా ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.92,100లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి రూ.1,00,480 (10 గ్రా.) పలుకుతోంది. మరోవైపు వెండి ధరలు మాత్రం నిన్నటితో పోలిస్తే స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధర
❄️ హైదరాబాద్ (Hyderabad) – రూ.92,350
❄️ విజయవాడ (Vijayawada) – రూ.92,350
❄️ విశాఖపట్టణం (Visakhapatnam) – రూ.92,350
❄️ వరంగల్ (Warangal) – రూ.92,350
Also Read: Kunamneni Sambasiva Rao: కాళేశ్వరంలో అవినీతిని నిగ్గు తేల్చాలి.. దోషులను కఠినంగా శిక్షించాలి!
24 క్యారెట్లు బంగారం ధర
❄️ విశాఖపట్టణం (Visakhapatnam) – రూ.1,00,750
❄️ వరంగల్ (Warangal ) – రూ.1,00,750
❄️ హైదరాబాద్ (Hyderabad) – రూ.1,00,750
❄️ విజయవాడ – రూ.1,00,750
వెండి ధరలు
❄️ విజయవాడ – రూ.1,20,000
❄️ విశాఖపట్టణం – రూ.1,20,000
❄️ హైదరాబాద్ – రూ.1,20,000
❄️ వరంగల్ – రూ.1,20,000