Kunamneni Sambasiva Rao: IMAGE credit: swetcha reporter)
తెలంగాణ

Kunamneni Sambasiva Rao: కాళేశ్వరంలో అవినీతిని నిగ్గు తేల్చాలి.. దోషులను కఠినంగా శిక్షించాలి!

Kunamneni Sambasiva Rao: రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందనేది నిజమని, ఆ ప్రాజెక్టు ఇంజినీర్లపై ఏసీబీ (ACB raids)దాడుల్లో కోట్లు పట్టుబడుతున్నాయని, ఏ మేరకు అవినీతి జరిగిందనేది విచారణ సంస్థలు నిగ్గు తేల్చుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. (Kaleshwaram Project) కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు ప్రధాన బ్యారేజీలు దెబ్బతిన్న నేపథ్యంలో, వాటిని పక్కనబెట్టి తక్షణమే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పునర్నిర్మాణం లేదా.. ?

హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యురాలు పద్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, (, Annaram barrage )సుందిళ్ల బ్యారేజీల పునర్నిర్మాణం లేదా మరమ్మతులు, సాధ్యాసాధ్యాలపై అఖిలపక్ష సమావేశం, ఇరిగేషన్ మేధావులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఏకపక్షంగా తలపెట్టిన గోదావరి (Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. జల వివాదాలు ఉభయ తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదని హితవు పలికారు. సముద్రంలో కలిసే 3000 టీఎంసీల జలాలు ఎవరి వాటా ఎంతో తేల్చుకున్న తర్వాతే కట్టుకోవచ్చు అన్నారు.

 Also Read: MLC Kavitha: కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలి!

రూ.25 వేల కోట్లు ఖర్చు

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో గత ప్రభుత్వం చేపట్టిన (Kunamneni Sambasiva Rao) కాళేశ్వరం ప్రాజెక్టును సీపీఐ మొదటి నుంచి వ్యతిరేకించిందన్నారు. గతంలో నిర్ణయించిన ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్దనే బ్యారేజీ నిర్మిస్తే, ఒక్క లిఫ్టు ద్వారా ఎల్లంపల్లికి గ్రావిటీతో నీళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉండేదన్నారు. రీ డిజైన్ పేరుతో దానిని పక్కనబెట్టి, కాళేశ్వరం పేరుతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీల నుంచి ఎగువనా ఎల్లంపల్లికి నీటిని లిఫ్టు చేయడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్నదన్నారు. ఆ మూడు బ్యారేజీలు పనిచేసినా విద్యుత్ అప్పుల తిరిగి చెల్లింపులకు ఏటా రూ.25 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

భవిష్యత్తులో ఎలా.. ?

ఒకవేళ వాటిని తిరిగి నిర్మించినా, మరమ్మతులు చేసినా భవిష్యత్తులో ఎలా ఉంటాయని చెప్పలేమని, విజిలెన్స్ నివేదిక, ఎన్ తుది నివేదిక, జస్టిస్ పీసీ ఘోష్ నివేదికలు వచ్చాక అఖిలపక్షాలు, ఇరిగేషన్ నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తక్షణమే తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టి, ఎల్లంపల్లికి నీరు తీసుకెళ్లాలని, మధ్యలో ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో (BRS) బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంతో పాటు తుమ్మిడిహట్టిని కూడా చేపడతామన్నారని, ఎందుకు దానిని పూర్తి చేయాలని ప్రశ్నించారు.

రూ.2వేల కోట్లు

సుమారు రూ.లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరంలో ప్రధాన భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కింద ఇప్పటికే 70 కిలో మీటర్ల మేరకు కాలువలు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అక్కడి నుంచి దిగువ ప్రాంతాలకు నీరు వస్తున్న మైలారం వద్ద 20 మీటర్ల లిఫ్ట్ ఏర్పాటు చేస్తే అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా 40 కిలోమీటర్ల కాల్వ తవ్వితే నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీరు వస్తుందన్నారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తే విద్యుత్ భారం ఏడాదికి కేవలం రూ.2వేల కోట్లు మాత్రం కానుండగా, కాళేశ్వర ప్రాజెక్టుతో ఏడాది అవుతున్న రూ.10వేల కోట్ల విద్యుత్ భారం కూడా తప్పుతుందన్నారు.

 Also Read:Gonne Prakash Rao: మూడోసారి అధికారం కోసమే ఇదంతా.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!