MLC Kavitha(image credit: swetcha reporter)
తెలంగాణ

MLC Kavitha: కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తీసుకురావాలి!

MLC Kavitha: పోలవరం ప్రాజెక్టు సంబంధించి  (Andhra Pradesh) ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు ముంపు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ఈ నెల 25న తెలంగాణ, (Telangana) ఆంధ్రప్రదేశ్,(Andhra Pradesh) ఛత్తీస్‌గఢ్, (Chhattisgarh) ఒడిశా (Odisha) రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా పేరిట ప్రధాని మోదీ నిర్వహించబోయే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని సూచించారు. పోలవరం ముంపు గ్రామాలపై తెలంగాణలో కలపాలన్న అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 Also Read: Kavitha: కవితకు మద్దతుపై.. గులాబీ నేతల డైలామా!

ప్రజలు తీవ్ర ఇబ్బందులు

ఈ సందర్భంగా కవిత (Kavitha) మాట్లాడుతూ, ఏపీలో కలిపిన గ్రామాల్లోని ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివక్షకు గురవుతూ ఏ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందని, లేదంటే భారీ వరదలు వస్తే అన్ని గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మునిగిపోయే ప్రమాదంలో

పోలవరం (Polavaram) వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని తెలిపారు. పోలవరం (Polavaram) స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడంతో తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందని, భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాముడి భూమి వెయ్యి ఎకరాలు ఉందని, ఆ భూమి కూడా పోయిందని, దేవుడేమో తెలంగాణలో ఉన్నాడని తెలిపారు.

అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం (Polavaram) ముంపుపై ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణ ప్రభుత్వాలు (Telangana Government) సంయుక్త సర్వే నిర్వహించాలని సూచించారు. ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

 Also Read: Gonne Prakash Rao: మూడోసారి అధికారం కోసమే ఇదంతా.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి!

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..