Muzaffarnagar Horror: మానవ సంబంధాలు నానాటికి మరింత దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు (Illigal Affairs) ప్రాణాలను నిలువునా బలిగొంటున్నాయి. రక్తసంబంధీకుల మధ్య సైతం చిచ్చుపెట్టి హత్యలు చేసేలా పురిగొల్పుతున్నాయి. చివరికీ అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలను సైతం దారుణంగా హత్య చేసే స్థాయికి దిగజారుస్తున్నాయి. ఈ క్రమంలోనే యూపీలో మరో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీసింది.
అసలేం జరిగిందంటే?
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ముజాఫర్ నగర్ (Muzaffarnagar) జిల్లాకు చెందిన వసీం (Wasim), ముస్కాన్ (Muskan) భార్యభర్తలు. రుద్కాలి తలాబ్ (Rudkali Talab) గ్రామంలో తమ ఇద్దరు పిల్లలు అర్హాన్ (5), ఇనాయాతో జీవిస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 19న ఇద్దరు పిల్లలు అనుమానస్పదంగా మృతి చెందారు. తండ్రి జునైద్ కూలి పని కోసం.. చండీగఢ్ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు.
పిల్లలు అడ్డుగా ఉన్నారని..
ప్రాథమిక దర్యాప్తులో భాగంగా.. ముస్కాన్ ను ముజాఫర్ నగర్ పోలీసులు విచారించారు. ఈ క్రమంలో ఆమె ఇచ్చిన సమాధానాలు వారికి అనుమానస్పదంగా అనిపించాయి. దీంతో తమదైన శైలిలో ముస్కాన్ ను విచారించగా అసలు నిజం బయటపడింది. పిల్లలకు తానే విషం ఇచ్చి చంపినట్లు ముస్కాన్ అంగీకరించిందని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్ తెలిపారు. ఆమెకు జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని.. ఇందుకు పిల్లలు అడ్డుగా ఉన్నారన్న కారణంతోనే వారిని హత్య చేసిందని స్పష్టం చేశారు. అంతేకాదు పిల్లల హత్య తర్వాత వారు హనీమూన్ షికారుకు ప్లాన్ కూడా చేసుకున్నట్లు గుర్తించారు.
Also Read: BRS on Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం.. ప్రశ్నించే గొంతును అణిచివేస్తారా.. బీఆర్ఎస్ ఫైర్
పరారీలో ప్రియుడు
ఘటనపై విచారణ ప్రారంభించిన సమయంలో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం ముస్కాన్ చేసిందని ఎస్ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. పోస్ట్ మార్టం చేసేందుకు కూడా అంగీకరించలేదని చెప్పారు. ఎప్పటిలాగే పిల్లలతో కలిసి నిద్రించానని.. లేచేసరికి పిల్లలు ఇద్దరు చనిపోయి ఉన్నారని ఓ కట్టుకథ అల్లే ప్రయత్నం ముస్కాన్ చేసిందని చెప్పారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో విషం వల్లే చనిపోయినట్లు తేలిందని స్పష్టం చేశారు. పిల్లలలో హత్యలో భాగమైన ప్రియుడు జునైద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసు అధికారి తెలిపారు. అతడి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.