Tanya Tyagi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Tanya Tyagi: మరో అంతుచిక్కని మరణం.. ఎవరీ తన్యా త్యాగి?

Tanya Tyagi: కెనడాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంతుచిక్కని కారణంతో మరో భారతీయ విద్యార్థి ప్రాణం పోయింది. అస్పష్టమైన కారణంతో తన్యా త్యాగి (Tanya Tyagi Tragedy) అనే భారతీయ విద్యార్థిని అక్కడ చనిపోయింది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. ఎక్స్ వేదికగా తన్యా త్యాగి మృతిపై ఒక ప్రకటన విడుదల చేసింది. నివాళులు అర్పిస్తున్నట్టుగా ప్రకటించింది.

‘‘కాల్గరీ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ స్టూడెంట్ తన్యా త్యాగి ఆకస్మిక మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. సంబంధిత అధికారులతో కాన్సులేట్ సంప్రదింపులు జరుపుతోంది. మృతురాలి కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తాం. మృతురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. తన్యా త్యాగి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం’’ అని పేర్కొంది.

Read  this- YS sharmila: ఏపీలో రప్పా రప్పా రచ్చ.. జగన్‌ను ఏకిపారేసిన వైఎస్ షర్మిల..!

తన్యా త్యాగి మృతికి కారణంపై కెనడా అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో, త్యాగి మరణానికి కారణం ఏంటనేది అస్పష్టంగా ఉంది. ఆమె ఎలా చనిపోయింది, మరణానికి దారితీసిన కారణాన్ని కాల్గరీ లేదా కెనడా పోలీసు అధికారులు వెల్లడించలేదు. అయితే, తన్యా మృతికి గుండెపోటే కారణమంటూ జూన్ 17న భారత ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేసి ఓ ఎక్స్ ఖాతా పేర్కొంది.

ఇషూ త్యాగి (అడ్వకేట్) అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఈ ట్వీట్ చేశారు. ‘‘సాయం కోసం అభ్యర్థన. ఈశాన్య ఢిల్లీలోని విజయ్ పార్క్‌, 559/11డీ, లేన్ నంబర్ 12 అడ్రస్‌కు చెందిన చెందిన తన్యా త్యాగి అనే విద్యార్థిని చదువు కోసం కెనడాకు వెళ్లింది. అయితే, 2025 జూన్ 17న గుండెపోటుతో ఆమె చనిపోయింది. మృతదేహాన్ని భారత్ తీసుకురావడానికి ప్రధాని మోదీని విద్యార్థిని కుటుంబం కోరుతోంది. తన్యా త్యాగి మృతదేహాన్ని భారత్‌కు తీసుకురాావాలంటే ఎవర్ని సంప్రదించాలో తెలియదు. అందుకే, ప్రధానమంత్రి కార్యాలయాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని, విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తన్యా త్యాగి తండ్రి పేరు విపుల్ త్యాగి. అతడి ఫోన్ నంబర్ 9354758957’’ అంటూ సదరు వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే, గుండెపోటుతో చనిపోయినట్టుగా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. త్యాగి కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకుగానూ కెనడా అధికారులతో ఇండియన్ కాన్సులేట్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

Read  this- Air India: ఎయిరిండియాకు ఏమైంది?, ఎందుకీ పరిస్థితి?

ఇంతకీ తాన్య త్యాగి ఎవరు?
తన్యా త్యాగి ఈశాన్య ఢిల్లీలోని విజయ్ పార్క్‌కు చెందిన యువతి. మాస్టర్స్ డిగ్రీ చదవడానికి కెనడా వెళ్లింది. కాల్గరీ యూనివర్సిటీలో ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీలో ఆమె మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నట్టు తన్యా లింక్డ్ఇన్ పేజీ ద్వారా వెల్లడైంది. జయ్‌పీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తన్యా అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె‌కు ఇప్పటికే వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. డీజీ జిందాల్ గ్రూప్స్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌గా, ఎన్విరో ల్యాబ్‌లో క్వాలిటీ కంట్రోల్ ఇంటర్న్‌గా, జాస్పర్ కాలిన్ రీసెర్చ్‌లో మార్కెట్ రీసెర్చ్ అసోసియేట్‌గా, జిప్పీ ఎడిబుల్ ప్రొడక్ట్స్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ ఇంటర్న్‌గా, మెట్రో మార్ట్ స్టోర్‌లో రిటైల్ సేల్స్ మేనేజర్‌గా తన్యా త్యాగి పనిచేసింది. కాగా, కెనడాలో భారతీయ విద్యార్థుల మృతి చెందుతున్న ఘటనలు ఆందోళన కలగిస్తున్న విషయం తెలిసిందే.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?