Air India
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Air India: ఎయిరిండియాకు ఏమైంది?, ఎందుకీ పరిస్థితి?

Air India: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌లో ఈ నెల 12న ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (Air India Crash) విమానం కుప్పకూలిన తర్వాత సంస్థకు చెందిన సర్వీసుల్లో అంతరాయాలు ఏర్పడడం, కీలక సర్వీసులు రద్దు కావడం పరిపాటిగా మారాయి. విమానాల నిర్వహణ, భద్రతా తనిఖీ కార్యకలాపాల కారణంగా ఇప్పటికే చాలా ఫ్లైట్ సర్వీసులను ఎయిరిండియా అధికారులు రద్దు చేశారు. ఈ జాబితాలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం విమానాల పర్యవేక్షణ, భద్రతా తనిఖీలు ఇందుకు కారణమని ఎయిరిండియా పలు ప్రకటనల ద్వారా తెలియజేసింది.

ఇప్పటికే చాలా సర్వీసులు రద్దవ్వగా, తాజాగా జూన్ 20న (శుక్రవారం) కూడా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. శుక్రవారం రద్దైన అంతర్జాతీయ విమాన సర్వీసుల జాబితాలో ఏఐ906 (దుబాయ్-చెన్నై), ఏఐ308 (ఢిల్లీ-మెల్‌బోర్న్), ఏఐ309 (మెల్‌బోర్న్-ఢిల్లీ), ఏఐ2204 (దుబాయ్-హైదరాబాద్) ఉన్నాయి. దేశీయ సర్వీసుల విషయానికి వస్తే, ఏఐ814 (పుణె – ఢిల్లీ), ఏఐ456 (అహ్మదాబాద్ – ఢిల్లీ), ఏఐ2872 (హైదరాబాద్ – ముంబై) ఉన్నాయి.

Read this- Rowdy Sheeter Arrest: ఓరి నీ తెలివి తగలెయ్య.. ఎలా వస్తాయ్‌రా ఈ ఐడియాలు.. ఇక నీకుందిలే!

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వైనం
అహ్మదాబాద్-లండన్ గాట్విక్ డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాదం నుంచి ఎయిరిండియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. భారీ ప్రమాదం కావడంతో సంస్థకు సంబంధించిన విస్తృత కార్యకలాపాలు కొంతమేర సంక్షోభానికి గురయ్యాయి. సంస్థ సిబ్బంది మానసిక స్థితిని కూడా ఈ దుర్ఘటన ఒకింత ప్రభావితం చేసింది. ఈ పరిస్థితుల నుంచి సిబ్బంది క్రమక్రమంగా మెరుగుపడుతున్నారు.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఏకంగా 66 డ్రీమ్‌లైనర్ విమానాలు రద్దు అయినట్టు డీజీసీఏ గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క జూన్ 12నే 50 డ్రీమ్‌లైనర్ విమాన సర్వీసుల్లో ఆరు రద్దయ్యాయని వివరించింది. జూన్ 18 నాటికి 33 డ్రీమ్‌లైనర్‌ విమాన సర్వీసుల్లో 24 తనిఖీల కారణంగా రద్దయ్యాయి. రాబోయే మరికొన్ని రోజులలో కూడా మరిన్ని విమాన సర్వీసులు రద్దు కానున్నాయి. పలు విమానాల తనిఖీకి ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. విమానాల నిర్వహణ సమస్యల కారణంగా ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు విమానాలను పక్కన పెట్టారు. ఎయిరిండియా క్రాష్ తర్వాత సమగ్ర భద్రతా తనిఖీలకు డీజీసీఏ ఆదేశాలు ఇవ్వడంతో సంస్థ పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది.

Read this- Gold Rate ( 20-06-2025): గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..

ఈ రోజు (శుక్రవారం) రద్దైన విమానాలతో కలుపుకొని ఈ వారం రద్దైన విమానాల జాబితా మరింత పెరిగింది. అహ్మదాబాద్-లండన్ మార్గంలో కొత్తగా ప్రారంభించిన ఏఐ-159 (గతంలో ఏఐ-171) విమాన సర్వీసుతో పాటు మరో 13 డ్రీమ్‌లైనర్ విమానాలు రద్దు అయ్యాయి. ప్రమాదానికి గురైంది డ్రీమ్‌లైనర్ విమానం కావడంతో ఆ మోడల్ విమానాల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఎక్కువ సమయం కూడా తీసుకుంటున్నారు. ఫలితంగా రద్దు చేయాల్సి వస్తోంది.

కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో విమానంలో 242 మంది ప్యాసింజర్లలో 241 మంది, విమానం కూలిన ప్రదేశం జేబీ మెడికల్ కాలేజీలో 30 మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. ప్యాసింజర్ల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. ఎముకలు, మాంసపు ముద్దలు మాత్రమే మిగిలాయి. అందుకే, డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాలను గుర్తిస్తు్న్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు