CS Ramakrishna Rao: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(Ramakrishna Rao) సందర్శించారు. కార్పోరేషన్‌లో జరుగుతున్న అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సంబంధిత శాఖల సెక్రటరీలతో సీఎస్ పరిశీలించారు. తాగు నీటి సౌకర్యం కోసం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి సీఎస్ కు వివరించారు. కొత్తగా ఏర్పడిన కాలనీలలో పైప్ లైన్ల ఏర్పాటుకు సంబంధించి ఎస్టిమేట్లను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులు ఆదేశించడం జరిగిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పురోగతి
జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా కావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నట్లు వివరించారు. పారిశుద్ద్య నిర్వహణను సీఎస్(CS) పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో విద్యుత్ దీపాల ఏర్పాటు, వార్డుల్లో నాలాల శుభ్రత తదితర అంశాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం కోత్వాల్ గూడలో(kothvall Guda) నిర్మాణంలో ఉన్న హెచ్‌ఎండిఏ(HMDA) ఎకో పార్కును సందర్శించారు. అక్కడి పార్కులోని వివిధ దేశాల పక్షులు,(Birds) గార్డెనింగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని నిర్వాహకులను అభినందించారు.
Also Read: Harish Rao: సీఎంకు బేసిన్‌లపై నాలెడ్జ్ లేదు.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!
మౌలిక సదుపాయాల కల్పన
అక్కడి నుంచి రాజేంద్ర నగర్(Rajendhra Nagar) నియోజకవర్గానికి వెళ్లి బుద్వేల్‌లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌కు(ORR) అవతలి వైపు, ఓఆర్‌ఆర్‌కు పక్కన గల కొన్ని గ్రామాలు ఇటీవల జిహెచ్‌ఎంసి(GHMC) లో విలీనమైనందున ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎలా ఉందో తెలుసుకునేందుకు శంషాబాద్ మున్సిపాలిటీని సందర్శించినట్లు తెలిపారు. రాష్ర్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ పర్యటన ఉద్దేశ్యమన్నారు. సీఎస్ వెంట రాష్ర్ట మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్‌ఎండిఎ సెక్రటరీ సర్ఫరాజ్ అహ్మద్, జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఆర్డిఓ వెంకట్ రెడ్డి, పీడీ హౌసింగ్ నాయక్, సంబంధిత అధికారులు ఉన్నారు.
Also Read: Maoists Killed: ఛత్తీస్గఢ్ అడవుల్లో.. మరో ఎన్కౌంటర్!