Viral News
Viral, లేటెస్ట్ న్యూస్

Viral News: భార్యను వెంటబెట్టుకొని జ్యువెలరీకి వెళ్లిన 93 ఏళ్ల వ్యక్తి .. ఏం కొన్నాడో తెలుసా?

Viral News: జ్యువెలరీ షాప్‌కు సాధారణ వ్యక్తులు వెళ్లినప్పుడు ఒకలా, సంపన్న వ్యక్తులు విచ్చేసినప్పుడు మరోలా అక్కడి సిబ్బంది వ్యవహరిస్తుంటారు. పేదవారిలా కనిపించే వ్యక్తులు పెద్దగా నగలు కొనుగోలు చేయరులే అని వారు భావిస్తుంటారు. 93 ఏళ్ల వయసున్న ఓ పెద్దాయన సాంప్రదాయ తెల్లటి ధోతీ-కుర్తా, టోపీ ధరించి, తన భార్యను వెంటబెట్టుకొని జ్యువెలరీ షాప్‌కు వెళితే అక్కడి సిబ్బంది పొరబడ్డారు. భిక్షాటన (బెగ్గింగ్) చేయడానికి వచ్చారేమోనని భావించారు. ఏదైనా ఆర్థిక సాయం కోరడానికి వచ్చుంటారులే అని తప్పుగా భావించారు. ఏం కావాలంటూ ఆ వృద్ధ దంపతులను ప్రశ్నించారు. ‘నా భార్యకు మంగళసూత్రం’ కావాలంటూ పెద్దాయన వినమ్రంగా సమాధానం ఇవ్వడంతో సిబ్బంది మొత్తం అవాక్కయ్యారు. పొరబడ్డామని నోరు కరచుకున్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది.

Read this- BCCI: బీసీసీఐకి భారీ ఎదురుదెబ్బ.. బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు

తన భార్యకు ‘మంగళసూత్రం’ కోనాలనుకుంటున్నానని పెద్దాయన చెప్పడంతో షాప్ యజమాని ఆశ్చర్యపోయాడు. 93 ఏళ్ల వయసులో భార్య పట్ల అతడి ప్రేమకు మంత్ర ముగ్ధుడయ్యాడు. కేవలం రూ.20 తీసుకొని మంగళసూత్రాన్ని ఇచ్చాడు. రూ.1,120 విలువ దానిని దాదాపు ఉచితంగా అందించారు. అయితే, ఆశీర్వాదంగా రూ.20 తీసుకున్నానని జ్యువెలరీ యజమాని వివరించాడు. ఆసక్తికర ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral News) వైరల్‌గా మారింది. ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పెద్ద వయసులోనూ తన భార్య పట్ల పెద్దాయన చూపుతున్న ప్రేమపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

కాగా, ఆ పెద్దాయన పేరు నివృత్తి షిండే, భార్య పేరు శాంతాబాయి. జల్నా జిల్లాలోని అంబోరా జహాగీర్ గ్రామానికి చెందినవారు. నిరాడంబరమైన వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరిద్దరూ ఆషాడ ఏకాదశి వేడుక కోసం కాలినడకన పండర్‌పూర్‌ అనే ఊరికి తీర్థయాత్ర చేస్తున్నారు.

Read this- Actor Arya: స్టార్ నటుడు ఆర్యకు బిగ్‌ షాక్.. ఇంట్లోకి ప్రవేశించిన ఐటీ అధికారులు

తీర్థయాత్ర క్రమంలోనే ఛత్రపతి శంభాజీనగర్‌లో జ్యువెలరీ షాప్‌కు వెళ్లారు. తన భార్య కోసం సాంప్రదాయ మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని ఆ పెద్దాయని చెప్పినప్పుడు భావోద్వేగానికి గురయ్యామని షాప్ యజమాని చెప్పారు. పెద్దావిడపై ఆయన ప్రేమకు మురిసిపోయానని, ఆయన వద్ద నుంచి రూ. 20 మాత్రమే తీసుకొని నెక్లెస్‌ను (రోల్డ్ గోల్డ్) బహుమతిగా ఇచ్చానని చెప్పారు. మంగళసూత్రం కావాలంటూ తన చేతికి రూ.1,120 ఇచ్చాడని, ఆయన వినమ్రత తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఆయన ఆశీర్వాదం కోరానని, ఆ జంటకు మంగళసూత్రాన్ని అందజేశానని వివరించారు.

 

ఉచితంగా మంగళసూత్రం తీసుకుంటున్న సందర్భంలో దంపతులు ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. పెద్దావిడ శాంతాబాయ్ కళ్లు చెమర్చింది. ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు. కాసేపటి తర్వాత తేరుకొని జువెలరీ యజమానితో మాట్లాడడం వైరల్ వీడియోలో కనిపించింది. కాగా, ఈ జంట ఎక్కడికి వెళ్లినా కలిసి ప్రయాణిస్తుంటారని స్థానికులు చెప్పారు. జీవిత చరమాంకంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తుంటారని పేర్కొన్నారు. వాళ్లకు ఒక కొడుకు ఉన్నప్పటికీ, అతడిపై ఆధారపడబోరని, వారిపై వారు ఆధారపడుతుంటారని తెలిపారు. ప్రయాణాలలో జనాల సాయంపై ఆధారపడుతుంటారని చెప్పారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు