GHMC Commissioner: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన విన్నపాలు, అర్జీల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయవద్దని జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ ఆర్‌వీ కర్ణన్(R V Karnan) అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడానికి వచ్చిన ప్రజలు సమర్పించిన విన్నపాలను అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమం
ప్రజల సమస్యల పరిష్కారంలో సంబంధిత హెచ్‌ఓడీలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ (GHMC)ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన (Prajavani Program) ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 74 విన్నపాలు అందాయి. వీటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యూబీడీ విభాగం 3, హెల్త్, అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాలకు రెండు చొప్పున, రెవెన్యూ, లేక్స్, యూసీడీ, ప్రాజెక్ట్స్, జలమండలి, లీగల్, చార్మినార్ జోన్‌కు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు అందాయి. ఫోన్ ఇన్ ద్వారా 2 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Minister Seethakka: పొగరుతో కేటీఆర్.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!
❄️జోన్ల వారీగా 91 ఫిర్యాదులు
❄️కూకట్‌పల్లి 47
❄️శేరిలింగంపల్లి 18
❄️సికింద్రాబాద్ 14
❄️ఎల్బీనగర్ 7
❄️చార్మినార్ 4
❄️ఖైరతాబాద్ 1
హైదరాబాద్ కలెక్టరేట్‌లో..
హైదరాబాద్ ( Hyderabad) జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దాసరి హరిచందన ప్రజల నుంచి మొత్తం 147 అర్జీలను స్వీకరించారు. అందిన 147 దరఖాస్తుల్లో అత్యధికంగా హౌసింగ్ విభాగానికి (77) చెందినవి ఉన్నాయి. ఇందులో 2బీహెచ్‌కే ఇళ్ల కోసం 48 దరఖాస్తులు కాగా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 29 దరఖాస్తులు అందాయి. వీటితో పాటు పెన్షన్లకు 7, కలెక్టరేట్ సెక్షన్లకు 16, రెవెన్యూకు 13, ఇతర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
అర్జీదారులు సమర్పించిన సమస్యలపై క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ హరిచందన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కదిరవన్ పలని, జీ ముకుంద రెడ్డి, డీఆర్వో ఈ వెంకటాచారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Uttam Kumar Reddy: పోలవరం మార్పులను తిరస్కరించండి.. మంత్రి డిమాండ్!