GHMC: జీహెచ్ఎంసీలో (GHMC) ఇంజినీర్ల (Engineers) అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం ఐఎస్ సదన్ డివిజన్‌లో రూ.10 లక్షలతో వేయాల్సిన సీసీ రోడ్డును నిర్మించకుండానే ఇద్దరు ఇంజినీర్లు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై బిల్లులను కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.దీంతో జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్ బిల్లులు కాజేసిన ఇద్దరు ఇంజినీర్లలో (Engineers) ఒకరిపై సస్పెన్షన్ వేటు వేయగా, మరొకరిని విధుల్లో నుంచి తొలగించారు. కాజేసీన మొత్తం బిల్లును కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ రకమైన ఇంజినీర్ల (Engineers) అవినీతికి బ్రేక్ వేసేందుకు ఎలాంటి టెండర్ ఆహ్వానించాలన్న స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి చేసిన అధికారులు ఇప్పుడు పని ఎలాంటిదైనా ఇంజినీర్లు (Engineers) అవినీతికి పాల్పడకుండా చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సర్కిళ్లలో చేపట్టే పనుల్లో గతంలో ఎలాంటి టెండర్లు చేపట్టినా, పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలన్నా, అది డిప్యూటీ కమిషనర్ పరిధిలోనే ఉండేది. ఇలాగైతే తాము చేతివాటం ప్రదర్శించే అవకాశం లేదన్న విషయాన్ని గ్రహించిన ఇంజినీర్లు కొద్ది సంవత్సరాల క్రితం ఆ బాధ్యతల నుంచి డిప్యూటీ కమిషనర్లను తప్పించారు.
Also Read: CM Revanth Reddy: నాయకులు క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలి!
టెండర్లు, పనులు పరిశీలన
దీంతో సర్కిల్స్, జోన్లలో ఏ పనులు చేపట్టినా డిప్యూటీ కమిషనర్లకు, జోనల్ కమిషనర్లకు సంబంధం లేకపోవడంతో పాటు ప్రతిపాదనల రూపకల్పన మొదలుకొని, టెండర్లు, పనులు పరిశీలన, చివరకు బిల్లుల చెల్లింపు వరకు అన్ని ప్రక్రియను ఇంజనీర్లే (Engineers) కైవసం చేసుకున్నారు. కానీ, తాజాగా ఐఎస్ సదన్‌లో చేయని పనికి బిల్లులు కాజేసిన ఘటనతో ఎలాగైనా సరే ఇంజినీర్ల (Engineers) అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు సర్కిళ్ల స్థాయిలో చేపట్టే పనులకు డిప్యూటీ కమిషనర్ల భాగస్వామ్యం తప్పనిసరి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
అక్రమాలకు బ్రేక్
సర్కిల్ స్థాయి పనులకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ల అనుమతి తీసుకోవటంతో పాటు పనులను తనిఖీ చేయడంతో పాటు బిల్లుల చెల్లింపు వరకు డిప్యూటీ కమిషనర్లు, అలాగే జోనల్ స్థాయి పనులకు జోనల్ కమిషనర్‌ను ప్రతిపాదనల స్థాయి నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రమేయం ఉండేలా వారిని కూడా వర్క్ మేనేజ్‌మెంట్‌లో భాగస్వాములను చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పనుల్లో ఇంజినీర్లతో (Engineers) పాటు డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల జోక్యం ఉంటే ఏదో ఓ స్థాయిలో అక్రమాలకు బ్రేక్ పడుతుందని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈ నిర్ణయానికి సంబంధించి త్వరలోనే అధికారికంగా ఆదేశాలు సైతం వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. అంతకు ముందే అన్ని సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో పాటు ఇంజినీర్లతో (Engineers) ఓ సారి సమావేశం నిర్వహించాలని కమిషనర్ కర్ణన్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Congress MLAs: ఖాజాగూడ భూములపై హైకోర్టులో పిల్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు