Air India Hongkong
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Air India: ఢిల్లీ వస్తున్న విమానంలో లోపం.. టెన్షన్ టెన్షన్

Air India: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం (Air India Technical Glitch) ఘోర ప్రమాదానికి గురైన తర్వాత, విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా వెలుగుచూసింది. సోమవారం ఉదయం హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్టు (Hong Kong Airport) నుంచి ఢిల్లీ బయలుదేరిన ‘ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్’ (Air India, Boeing 787 Dreamliner) ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో, విమానాన్ని మార్గమధ్యంలోనే వెనక్కి మళ్లించారు. తిరిగి హాంగ్‌కాంగ్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో ఫ్లైట్‌లోని ప్యాసింజర్లు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురవ్వడంతో ప్రయాణికులు టెన్షన్‌కు గురయ్యారు. అయితే, సురక్షితంగా ల్యాండింగ్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Read this- Indian-Origin Dies: ఆస్ట్రేలియా పోలీసుల దుర్మార్గం.. మెడపై మోకాలితో తొక్కి.. ఇండియన్‌ హత్య!

ఎయిరిండియా ఏఐ-315 ఫ్లైట్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఈ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉందని సిబ్బంది గుర్తించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఈ ఘటనపై ఎయిరిండియా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Read this- KTR Comments: 30 సార్లైనా విచారణకు వస్తా.. జైలుకు సైతం రెడీ.. కేటీఆర్

మరో ఫ్లైట్‌లో కూడా..

ఆదివారం కూడా ఎయిరిండియాకు చెందిన ఒక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి వడోదర బయలుదేరిన ఫ్లైట్ ఏఐ819లో సమస్య తలెత్తడంతో విమానాన్ని వెనక్కి తిప్పి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. ల్యాండింగ్ గేర్‌లో సమస్య ఉన్నట్టుగా గుర్తించారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. 6.51 గంటల సమయంలో టేకాఫ్ తీసుకోగా, విమానం కొంతదూరం ప్రయాణించిన తర్వాత ‘ల్యాండింగ్ గేర్’ పనితీరు సంతృప్తికరంగా లేదని పైలట్లు గుర్తించారు. వెంటనే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను(ATC) సంప్రదించారు. ముందస్తు జాగ్రత్త విమానాన్ని వెనక్కి తీసుకొస్తామని విజ్ఞప్తి చేశారు. అనుమతి ఇవ్వడంతో వెంటనే వెనక్కి తీసుకెళ్లారు. మొత్తానికి ఎలాంటి ప్రమాదం లేకుండా ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండింగ్ కావడంతో ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు.

జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా బోయింట్ 787 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన నాలుగు రోజుల తర్వాత ఈ ఘటనలు నమోదయ్యాయి. కాగా, అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్యాసింజర్లలో ఒక్కరు మినహా అందరూ చనిపోయారు. విశ్వాస్ కుమార్ రమేష్ అనే బ్రిటన్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రయాణికులతో పాటు విమానం కూలిన జేబీ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా 30 మందికి పైగా చనిపోయారు.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు