Catherin Tressa in bikini
Cinema

Catherine Tresa: బికినీలో.. ఎమ్మెల్యే

Catherine Tresa:
అందం అభినయం అన్నీ ఉన్నా కొందరికి అదృష్టం కలిసిరాదు. కేరళ బ్యూటీ కేథరిన్ థ్రెసా విషయంలో అదే జరిగింది. తెలుగులో తొలిసారి వరుణ్ సందేశ్ సరసన చమ్మక్ ఛల్లో మూవీలో నటించింది కేథరిన్ థ్రెసా. అయితే తర్వాత అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో.. మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఈమెకు ఇక మంచి అవకాశాలు వస్తాయని అంతా భావించారు. తర్వాత వచ్చిన సినిమాలలో కేవలం సెకండ్ హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇక అల్లు అర్జున్ తో సెకండ్ హీరోయిన్గా చేసిన సరైనోడు మూవీలో కేథరిన్ చేసిన ఎమ్మెల్యే పాత్ర ఆమెకు మంచి గుర్తింపునిచ్చింది. అందులో యూవ్ ఆర్ మై ఎమ్మెల్యే అంటూ అల్లు అర్జున్ పాడిన పాట బాగా పాపులార్ అయింది అప్పట్లో. దీనితో ఈ ఎమ్మెల్యే భామకు మళ్లీ అవకాశాలు వస్తాయని భావించినా సరైన అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. విమర్శకులు కూడా ఆమె నటన, అందచందాలే ఆ సినిమాకున్న ఏకైక మంచి అంశంగా అభివర్ణించారు.

మెయిన్ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు

తెలుగులో కేథరిన్ కు అవకాశాలు క్రమంగా తగ్గాయి. ఇదే సమయంలో మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఉపేంద్ర హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ..ఆ సినిమాతో తన పాపులారిటీని మరింత పెంచుకుంది. అయితే కేథరిన్ కెరీర్‌కు స్టాండ్ ఇచ్చే సినిమా ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. తాజాగా కేథరీన్ గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. బికినిలో దర్శన ఇచ్చి కుర్రకారు మతిపొగొట్టింది. బికినీలో కనిపించి కన్నుల విందు చేసింది. స్విమ్మింగ్‌ పూల్‌‌లో ఈ అమ్మడు స్విమ్ చేస్తూ అందాలను ఆరబోసింది. తడిసిన అందాలతో కేథరిన్ థెసా ఫోటోలకు ఇచ్చిన ఫోజులకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. గతంతో పోల్చితే కేథరిన్‌ ఇప్పుడు ఇంకాస్త అందంగా ఆకర్షణీయంగా కనిపించి అభిమానులను అలరించింది.

Just In

01

Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?