Black Box
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Black Box: బ్లాక్ బాక్స్ దొరికింది.. విమాన విషాదంలో కీలక పరిణామం

Black Box: సుమారుగా 265 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిరిండియా విమాన ప్రమాదానికి (Air India Plane Crash) అసలు కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి కారణాలు ఇవేనంటూ రకరకాల అంచనాలు, విశ్లేషణలు వెలువడుతున్నప్పటికీ అవేమీ నిజం కాదు. విమాన ప్రమాదాల దర్యాప్తులో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్‌ను (Black Box) సమగ్రంగా విశ్లేషించిన తర్వాత స్పష్టత వస్తుంది. విమాన ప్రమాద స్థలంలో తొలి రోజు ఎంత అన్వేషించినా లభ్యంకాని బ్లాక్ బాక్స్ శుక్రవారం దొరికింది. విమానం కూలిన మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ రూఫ్‌టాప్‌పై దీనిని గుర్తించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శుక్రవారం అన్వేషణలో భాగంగా బ్లాక్ బాక్స్ లభ్యమైందని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.

Read this- Plane Crash: ఎయిరిండియా క్రాష్‌పై కేఏ పాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

అన్ని వివరాలు నిక్షిప్తం

విమాన ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. విమానం ప్రయాణించిన వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరుతో పాటు కాక్‌పిట్ ఆడియో వంటి కీలకమైన సమాచారం అంతా దీనిలో రికార్డు అవుతుంది. పైలట్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య కమ్యూనికేషన్‌ కూడా రికార్డు అవుతుంది. తీవ్రమైన ఉష్ణోగ్రత‌లో కూడా ఈ బాక్స్‌ చెక్కుచెదరదు. నీటిలో మునిగినా, ఇతర తీవ్రమైన ప్రభావాలు ఎదురైనా తట్టుకునేలా దీనిని తయారు చేస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కీలక డేటా భద్రపరిచే విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. ఉక్కు, టైటానియం వంటి అత్యంత పటిష్టమైన, మన్నికైన పదార్థాలతో తయారు చేస్తారు. బ్లాక్ బాక్స్‌లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి డీఎఫ్‌డీఆర్, కాగా రెండవది సీవీఆర్ (కాక్‌పిట్ వాయిస్ రికార్డర్). డీఎఫ్‌డీఆర్ విమానానికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని రికార్డు చేస్తుంది. ఇక, సీవీఆర్ డివైజ్ కాక్‌పిట్ నుంచి ఆడియోను రికార్డు చేస్తుంది. పైలట్ల మధ్య సంభాషణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌‌తో పాటు రేడియో ఎక్స్ఛేంజీలతో జరిపిన సంభాషణను కూడా రికార్డు చేస్తాయి.

Read this- Vijay Rupani: నంబర్1206.. మాజీ సీఎం తలరాత కాకపోతే మరేంటి?

బ్లాక్ బాక్స్ రంగు ఏమిటి?

బ్లాక్ బాక్స్ అనగానే పరికరం నల్లగా ఉంటుందని చాలా మంది భ్రమపడుతుంటారు. నిజానికి అది నారింజ రంగులో ఉంటుంది. విమాన ప్రమాదం జరిగి, భారీ మంటల ధాటికి కాలిపోయిన శిథిలాల కింద, లేదా నీటి అడుగు భాగంలోనైనా సులభంగా గుర్తించేందుకు వీలుగా ప్రకాశవంతంగా కనిపించే నారింజ రంగులో ఉంటుంది.

ఘటనా స్థలానికి ఎన్ఏఐ

ఎయిరిండియా బోయింగ్ 787 స్టార్ ఎయిర్‌లైనర్ విమానం కూలిన ప్రదేశాన్ని ఎన్ఏఐ (NIA) శుక్రవారం సందర్శించింది. ప్రత్యేక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించిందని ఓ అధికారి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన పలువురు అధికారులు కూడా వారి వెంట ఉన్నారని చెప్పారు.

విమానానికి సంబంధించిన ముఖ్యమైన డేటాను రికార్డ్ చేసే హార్డ్‌వేర్ పరికరమే ‘బ్లాక్ బాక్స్’. దీనిని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) అని కూడా పిలుస్తారు. గుజరాత్ ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది సహాయంతో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం దీనిని అన్వేషించి దొరకబట్టింది. దేశంలోనే అతిపెద్ద విమాన ప్రమాదాలలో ఒకటైన ఎయిరిండియా క్రాష్‌కు గల కారణాల గుట్టును తెలియజేయడంలో బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషించనుంది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు