KA Paul PM Modi
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Plane Crash: ఎయిరిండియా క్రాష్‌పై కేఏ పాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం గురువారం ప్రమాదానికి (Air India Plane Crash) గురై అందులోని 241 మంది ప్యాసింజర్లు, సిబ్బంది మరణించగా, ఒకే ఒక్కరు మాత్రమే బతికిన విషయం తెలిసిందే. విమానం కూలిన ప్రదేశంలోని జేబీ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంపై రాజకీయ, సినీ రంగాలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజా, ప్రజాశాంతి పార్టీ (PrajaSanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) కూడా విమాన ప్రమాదంపై స్పందించారు.

మోదీ రాజీనామా చేయాలి
ఎయిరిండియా విమాన ప్రమాదానికి బాధ్యత వహించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi), కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తమ పదవులకు రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.100 కోట్లు చెల్లించాలని, ఎక్స్‌గ్రేషియాగా ఈ భారీ మొత్తం అందించాలని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

Read this- Priya Naidu: పని ఇవ్వని వాడే ఎక్కడ పడితే అక్కడ చేతులేసి నొక్కుతాడు

తాను అహ్మదాబాద్‌కు వెళ్లాల్సి ఉందని, కానీ, ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పాల్ వివరించారు. ‘‘ఈ విమాన ప్రమాదం దేశ ఆర్థిక వ్యవస్థపై, పర్యాటక రంగంపై ప్రభావం చూపుతుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. కాబట్టి, బీజేపీ నిబంధనలకు కట్టుబడి కూడా మోదీ రాజీనామా చేయాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లేదా వేరే యువ నాయకుడిని ప్రధాని చేయాలి’’ అని కేఏ పాల్ అన్నారు.

ప్రధానికి, మంత్రికి పాల్ ప్రశ్నలు
పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడుకు అనుభవం లేదని, అందుకే ఆయన వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్ అన్నారు. ‘‘ విమానయాన రంగంపై రామ్మోహన్ నాయుడుకు ఏబీసీడీలు కూడా తెలియవు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ఇది టెరరిస్ట్ అటాక్ ఆ?, శత్రువులు చేసిన అటాకా? అనేది గుర్తించాలి. అదానీ ఎయిర్‌పోర్ట్ రన్ వే 13 వేల అడుగులు లేకపోవడం ఏమిటి?. రన్ వే పొడవు పెంచాల్సి ఉన్నా, అదానీకి మోదీ ఎందుకు చెప్పలేదు?’’ అని కేఏ పాల్ ప్రశ్నించారు.

Read this- Bhopal Bridge: బుద్ధి ఉందా.. ఇలాగేనా నిర్మించేది.. కొత్త వంతెనపై వాహనదారులు ఫైర్!

నెతన్యాహు పిచ్చికుక్క
ఇరాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన దాడి మూడవ ప్రపంచ యుద్ధానికి కారణమవుతుందని కేఏ పాల్ జోస్యం చెప్పారు. ‘‘ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. నేను ఫోన్లు చేసినా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు స్పందించలేదు. నెతన్యాహు పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నాడు. ఇది మూడవ ప్రపంచ యుద్దానికి దారి తీస్తుంది. టెర్రరిస్టుల వల్లే యుద్దాలు జరుగుతున్నాయి. శాంతి చర్చలు జరపాలి. యుద్ధాలను ఆపాలి’’ అని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?