Ponnam Prabhakar (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Ponnam Prabhakar: మూతపడిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: వేసవి సెలవుల అనంతరం అనంతరం తిరిగి పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పూలు చల్లి విద్యార్ధులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వనించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని కేజీవీబీ పాఠశాల కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అక్కన్న పేట మండలంలోని గోవర్ధన గిరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పూజలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. రేగొండ గ్రామంలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల తిరిగి పునః ప్రారంభించారు. అందుకు గ్రామస్తులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

పిల్లల భవిష్యత్తును ఇక్కడ నుండే ప్రారంభించాలి

ఉపాధ్యాయులు మంచి చదువు చదిపిస్తే మిగతా పిల్లలు కూడా ఇక్కడ చేరాలని, నాలుగు సంవత్సరాలుగా మూతపడిన పాఠశాల తిరిగి ఈరోజు పునః ప్రారంభం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అన్ని అర్హతలు ఉండి అధ్యాపకులు ఉండి పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతారా అనే నాముషిగా ఉండదు. నేను, కలెక్టర్ అందరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని వచ్చాం అని చెప్పారు. ఏ గ్రామంలో అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇబ్బందులు ఉంటే ఆ గ్రామ పెద్ద మనుషులు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆ గ్రామానికి రాకుండా ఆ ఊరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని అన్నారు. అందుకు గ్రామస్తులు కృషి చేయాలన్నారు.

Also Read: Bhatti Vikramarka: ప్రపంచ పటంలో తెలంగాణ సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకుంది..

నాకు చాలా సంతోషంగా ఉంది: మంత్రి

పిల్లలను ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే వారికి అభినందిస్తం అన్నారు. తరగతి గదుల నిర్మాణం, బాత్రూంల నిర్మాణం వెంటనే చేపట్టాలని, వారం పది రోజుల్లో మళ్ళీ ఈ పాఠశాలకు వస్తాఅని అన్నారు. విద్యాబోధన, భోజనం, బాత్రూం, క్లాస్ రూమ్ ఎలా ఉందో చూస్తానని అన్నారు. ప్రైవేట్ పాఠశాల ఆర్భాటాలకు మనం లోనుకవద్దు. ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే నాముషి అని ఫీల్ కావద్దు అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో, కాలేజీల్లో చదువుతున్న వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రేపు మీరే ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నత ఉద్యోగులు అవుతారని మంత్రి ఆకాంక్షించారు. నేను ఏరువాక సందర్భంగా వ్యవసాయాన్ని ప్రారంభం చేసుకున్నాం ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా పాఠశాలలు ప్రారంభం చేసుకుంటున్నామని, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకంక్షలు తెలిపారు.

తల్లిదండ్రులకు గ్రామస్థులకు అభినందనలు

రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేగొండ గ్రామం గురించి చర్చించుకోవాలి. ఈరోజు ఒక పాఠశాల ప్రారంభం చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు రేగొండ గ్రామం అక్కన్నపేటలో ఆరోజు కలపడం తప్పే. అక్కన్న పేట ఎంత దూరం హుస్నాబాద్ ఎంత దగ్గర ఉంది. రేగొండ గ్రామాన్ని హుస్నాబాద్‌లో కలుపుతాం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి కంది తిరుపతి రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రైతులకు పండుగ లాంటి శుభవార్త..

 

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు