Hyderabad Metro Expansion (imagcredit:swetcha)
హైదరాబాద్

Hyderabad Metro Expansion: మేడ్చల్‌‌ల్లో ప్రజాభిప్రాయ సేకరణలో.. రభస

Hyderabad Metro Expansion: మెట్రో విస్తరణలో భాగంగా మేడ్చల్‌ జిల్లాలో ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ పనులను చేపట్టడం కష్టంగానే కనిపిస్తోంది. కారిడార్‌ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియకు ముందడుగు పడడం లేదు. అధికారులు చేపడుతున్న ప్రజాభిసేకరణ ప్రక్రియలోనూ బాధితుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేరకణలోనూ బాధితులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇండ్లను తొలగించవద్దని డిమాండ్‌ చేశారు.

అభివృద్ధికి వ్యతిరేకం కాదు.

తూముకుంట మున్సిపల్‌ కార్యాలయంలో డిఫ్యూటీ కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి అధ్యక్షతన భూ సేకరణపై ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు శామీర్‌పేట్‌ మండలంలోని హకీంపేట్‌, దేవరయంజాల్‌, తూముకుంట గ్రామాలవారు హాజరయ్యారు. అయితే జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బాధితులు బహిష్కరించారు. ప్లకార్డులు పట్టుకుని తూముకుంట మున్సిపల్‌ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అక్కడి నుంచి వెళ్లి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ సతీష్‌ గుప్తా మాట్లాడుతూ తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని న్యాయపరమైన డిమాండ్ల కోసమే పోరాడుతున్నామన్నారు.

Also Read: Indiramma Housing Scheme: నిరుపేదలకి అందని.. ఇందిరమ్మ ఇండ్లు!

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి 100 ఫీట్ల రోడ్డు సరిపోతుందన్నారు. నాగపూర్‌ తరహాలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు దానికోసం 200 ఫీట్ల భూమి అవసరం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. నష్టపోయిన భూ బాధితులందరికీ నష్టపరిహారం కింద అంతే విలువైన భూమిని మరోచోట కేటాయించాలని డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మొండి వైఖరి కొనసాగిస్తే తీవ్రమైన నిరసనలు చేపడతామని జేఏసీ సభ్యులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

భూ సేకరణ ప్రక్రియ తేలేనా

భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్న ప్రతిసారీ బాధితుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సంబంధించి 200 ఫీట్ల విస్తరణ అవసరం లేదని. 100 ఫీట్ల విస్తరణతో ఎలాంటి ఆస్తులు కోల్పోయే అవసరం రానందున వంద ఫీట్లతోనే రోడ్డు విస్తరణను చేపట్టాలని ఆస్తులు కోల్పోనున్న బాధితులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహిస్తున్న సభల్లో ప్రభుత్వానికి విన్నవిస్తూ వస్తున్నారు. ఒకవేళ తమ భూములు తీసుకుంటే బహిరంగ మార్కెట్‌ లో ఉన్న ధర ప్రకారం తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవిస్తామని అధికారులు చెబుతున్నారని కానీ ఇప్పటివరకు భూ సేకరణ పరిహాంరపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదని బాధితులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పట్లో భూ సేకరణ పక్రియ తేలేలా కనిపించడం లేదని తెలుస్తోంది. భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగక పనులు ప్రారంభం పైననూ నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

Also Read: Telangana: రాష్ట్రంలో మరో ఐదు పరిపాలన జోన్‌లు.. హెచ్ఎండీఏ అధికారుల కసరత్తు

 

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?