Telangana ( Image Source: Twitter)
తెలంగాణ

Telangana: రాష్ట్రంలో మరో ఐదు పరిపాలన జోన్‌లు.. హెచ్ఎండీఏ అధికారుల కసరత్తు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలో ఇప్పటి వరకున్న ప్లానింగ్ జోన్లను పరిపాలన జోన్లుగా మార్చేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించటంతో ఇప్పటి వరకు కేవలం ప్లానింగ్ వ్యవహారాలకే పరిమితం కాగా, ఇకపై ప్లానింగ్‌తో పాటు పరిపాలన వ్యవహారాలు కూడా కొనసాగేలా ఐదు జోన్లను ఏర్పాటు చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. హెచ్ఎండీఏ పరిధి ఏడు వేల కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి దాదాపు 10,472.72 చదరపు కిలోమీటర్లకు పెరగడంతో ప్రజలకు మెరుగైన సేవలందించడంతో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్లానింగ్ ప్లస్ పరిపాలనను కలిపి ఈ జోన్లను రూపాంతరం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పాత ఉమ్మడి ఐదు జిల్లాలను కలిపి హెచ్ఎండీఏ పరిధిని ఏర్పాటు చేయడంతో ఈ చిన్న పనికైనా వందలాది కిలోమీటర్ల నుంచి చిన్న చిన్న పనుల కోసం రాజధానిలోని హెచ్ఎండీఏ హెడ్ ఆఫీసుకు రావడం, వచ్చిన పనులు కాకపోవడంతో వచ్చిన వారు ఎక్కడ ఉండి పనులు చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడకుండా మొత్తం పరిధిలో ఐదు పరిపాలన జోన్ ఆఫీసులను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా 2 వేల చదరపు గజాల స్థలానికి సంబంధించిన భవన నిర్మాణ అనుమతుల కోసం రాజధానిలోని ప్రధాన కార్యాలయానికి రాకపోకలు సాగించడం, ఇంజినీరింగ్ విభాగంలోనూ రూ.కోటి మంజూరు కోసం అధికారులు ప్రధాన కార్యాలయానికి రాకపోకలు సాగించటం వంటి సమస్యలకు చెక్ పెట్టేలా ఈ పరిపాలన జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం హెచ్ఎండీఈ పరిధిలో ప్రతి రెండు వేల చదరపు కిలోమీటర్లకు ఓ పరిపాలన జోన్‌ను ఏర్పాటు చేసి, ఆ జోన్ కార్యాలయం ఆ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్లానింగ్‌లో మేడ్కల్ -1, మేడ్చల్- 2, ఘట్ కేసర్, శంషాబాద్, శంకర్‌పల్లి-1, శంకర్‌పల్లి-2 పేర్లతో ఆరు జోన్‌లు ఉండగా, ఇవి కాస్త ఐదు జోన్లుగా ప్లానింగ్ ప్లస్ పరిపాలన వ్యవహారాలు కొనసాగేలా జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి జోన్‌లో హెచ్ఎండీఏకు సంబంధించిన అన్ని విభాగాల సేవలు అందుబాటులో ఉండేలా పరిపాలన, ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎస్టేట్స్, అర్బన్ ఫారెస్ట్రీ, ఐటీ సెల్, లీగల్ సెల్ అన్ని విభాగాలుండేలా జోన్ల విభజన చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

మూడు కొత్త జోనల్ ఆఫీసులు

హెచ్ఎండీఏ పరిధిలో ఐదు ప్రాంతాల్లో ఐదు జోనల్ పరిపాలన కార్యాలయాలను ఏర్పాటు చేసే కొనసాగుతున్న కసరత్తులో భాగంగా ఐదు జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. కానీ, వాటిలో కేవలం మూడు జోన్లకు మాత్రమే కొత్త ఆఫీసులను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ భావిస్తున్నట్లు సమాచారం. హెచ్ఎండీఏ మొత్తం విస్తీర్ణం 10,472 చ.కి.మీ పరిధిని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు మొదలు కాగా, ఒక్కో జోన్‌కు 2094 చ.కి.మీ పరిధి ఉండేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు నాగార్జున సాగర్- శ్రీశైలం రహదారి, శ్రీశైలం- -బెంగుళూరు, నాగార్జున సాగర్- – విజయవాడ, విజయవాడ– నాగ్‌పూర్, నాగ్‌పూర్ – -ముంబై జాతీయ రహదారుల ఆధారంగా ఏరియాను విభజన చేపడితే ఎలా ఉంటుందన్న విషయాన్ని ఓ ప్రాక్టీస్‌గా అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తార్నాకలోని పాత హెచ్ఎండీఏ ఆఫీసులో ఒక జోనల్ కార్యాలయం, నానక్‌రాం గూడలోని హైదరాబాద్ గ్రోడ్ కారిడార్ లిమిటెడ్ ఆఫీసులో మరో జోనల్ ఆఫీసును ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. మిగిలిన మూడు జోన్లకు రెండు వేల 94 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఎంపిక చేసి, ఆ జోన్ పరిధిలో అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసి, ఈ మూడు జోనల్ పరిపాలన ఆఫీసులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే హెచ్ఎండీఏ ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలిసింది.

నియామకాలు, అధికారాలు

ఒక్కో జోన్‌కు ఓ జోనల్ మెట్రోపాలిటన్ కమిషనర్‌ను నియమించనున్నట్లు తెలిసింది. వీరికి జోనల్ స్థాయిలో వివిధ రకాల పనులు, పరిపాలన పరమైన నిర్ణయాలను తీసుకునేలా పవర్స్ కేటాయించనున్నారు. ఇక ప్లానింగ్ విభాగానికి సంబంధించి 2500 చదరపు గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు జోన్ మెట్రోపాలిటన్ కమిషనర్లు నిర్మాణ అనుమతులను జారీ చేసేలా అధికారుల కేటాయింపులు జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్ విభాగంలో నిధుల మంజూరు విషయంలోనూ జోనల్ కమిషనర్లకు ఒక పరిమితిని విధించి మంజూరీ అధికారాన్ని కేటాయించాలి భావిస్తున్నట్లు సమాచారం. కొత్త పరిపాలన జోన్లు, జోనల్ మెట్రోపాలిటన్ కమిషనర్ల నియాకమం జరిగిన తర్వాత ఇప్పటి వరకు అస్తవ్యస్తంగా తయారైన ఇంజినీరింగ్ విభాగంతో పాటు ఎస్టేట్ విభాగాల పనితీరు గాడిన పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కో పరిపాలన జోన్‌కు జోనల్ మెట్రోపాలిటన్ కమిషనర్, జోనల్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, ఇక ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి సూపరింటెండెంట్ ఇంజినీర్, ఎస్టేట్ ఆఫీసర్, అర్బన్ ఫారెస్ట్ విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్లను నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?