HYDRA: వర్షాకాలం సహాయక చర్యలపై.. హైడ్రా కసరత్తు!
HYDRA( image credit: twitter)
హైదరాబాద్

HYDRA: వర్షాకాలం సహాయక చర్యలపై.. హైడ్రా కసరత్తు!

HYDRA: ఇప్పటికే ప్రారంభమైన వర్షాకాల సహాయక చర్యలను సకాలంలో చేపట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమాలకు పాల్పడటంతో ఆ బాధ్యతలను మున్సిపల్ శాఖ హైడ్రాకు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే వర్షాకాలం మొదలుకావటంతో పాటు మహానగరానికి మూడు రోజుల వర్ష సూచన రావటంతో హైడ్రా వర్షాకాలం సహాయక చర్యలపై ఎలాంటి కసరత్తు చేస్తుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత సంవత్సరం (2024) జూన్ మాసం చివరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రై సిటీల్లోని సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలను కాపాడటంతో పాటు పది రోజుల క్రితం నుంచి హైడ్రా నాలా ఆక్రమణలపై చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే.

హైడ్రా టెండర్ల ప్రక్రియకు సిద్దం

వర్షాకాలం సహాయక చర్యల నిమిత్తం రూ.55 కోట్ల వ్యయంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లు, లేబర్ స్టాటిక్ టీమ్ లతో పాటు 164 వాహానాలను టెండర్ల ప్రక్రియ ద్వారా సమకూర్చాల్సి ఉండగా, వాహానాల విషయంలో జీహెచ్ఎంసీ రెండింతలు అద్దెలు చెల్లించేందుకు ప్రయత్నించి ఇసుజు వాహానాలను మాత్రమే ఎంగేజ్ చేయాలన్న నిబంధన పెట్టడంతో, టెండర్ల ప్రక్రియలోని అసలు దోపిడీ బట్టబయలైంది. దీంతో మున్సిపల్ శాఖ ఆ బాధ్యతలను బల్దియా నుంచి హైడ్రాకు బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఆదేశాలు జారీ చేయటంతో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లు, లేబర్ స్టాటిక్ టీమ్ లతో పాటు 164 వాహానాలను సమకూర్చుకునేందుకు హైడ్రా టెండర్ల ప్రక్రియకు సిద్దమవుతున్నట్లు తెలిసింది.

కానీ వాస్తవానికి హైడ్రా ఏర్పడి సంవత్సరం కూడా గడవలేదు. ఇప్పటి వరకు వర్షాకాల సహాయక చర్యలు పెద్దగా చేపట్టిన అనుభవంతో పాటు వానాకాలం సహాయక చర్యల్లో పాల్గోనే మాస్ టీమ్ కూడా హైడ్రా వద్ద లేకపోవటంతో ఈ సంవత్సరం హైడ్రా వానాకాలం కష్టాలను ఎలా తగ్గిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో జీహెచ్ఎంసీ ఈ సహాయక చర్యల్లో భాగంగా కేవలం నెలకు రూ.30 వేల అద్దెతో ఒక్కో వాహానాన్ని సమకూర్చేది.

Also Read: Shaiva Group: రాబోయే మూడేళ్లలో.. 5020మందికి ఉపాధి!

 కాంట్రాక్టర్లు కన్నం వేసేందుకు సిద్దం

కానీ జీహెచ్ఎంసీ చేపట్టిన టెండర్లలో ఇసుజు వాహానాలను మాత్రమే ఎంగేజ్ చేయాలన్న నిబంధన విధించటంతో పాటు ఒక్కో వాహానం అద్దెను ఏకంగా రూ. 63 వేలకు పెంచి, బల్దియా ఖజానాకు కన్నం వేసేందుకు అధికారులు, కాంట్రాక్టర్లు కన్నం వేసేందుకు సిద్దమయ్యారన్న విషయాన్ని గుర్తించిన మున్సిపల్ శాఖ ఆ బాధ్యతలను బల్దియా నుంచి హైడ్రాకు బదలాయించింది. కానీ త్వరలో హైడ్రా చేపట్టనున్న టెండర్ల ప్రక్రియలో కూడా ఇసుజు వాహానాల ప్రస్తావన ఉంటుందా? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

సమన్వయం కుదిరేనా?
మాన్సూన్ సహాయక చర్యల్లో భాగంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ లు, లేబర్ స్టాటిక్ టీమ్ లతో పాటు 164 వాహానాలను సమకూర్చుకునే బాధ్యతలతో పాటు వర్షకాలం సహాయక చర్యలతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్లలో మోటార్ల సహాయంతో నీటిని తోడేయటం, అవసరమైతే అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, నాలా సేఫ్టీ, నాలా ఆడిట్, నాలాల వద్ద ప్రమాదాల నివారణ చర్యలు, వర్షాకాలం తర్వాత నాలాల్లోని పూడికతీత పనులు, నాలాల నుంచి బయటకు తీసిన పూడికను రోడ్లపై నుంచి తరలించటం, నాలాల్లో వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించటం, చెట్లు విరిగిపడినా, కరెంటు స్తంభాలు నేలకొరిగినా, అవసరమైన సహాయక చర్యలన్నింటిని హైడ్రా చేపట్టే బాధ్యతలను మున్సిపల్ శాఖ అప్పగించింది.

కానీ సహాయక చర్యలను జలమండలి, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖలను సమన్వయం చేసుకుని చేపట్టాలని ఉత్తర్వుల్లో మున్సిపల్ శాక స్పష్టం పేర్కొనగా, ఇప్పటి వరకు సర్కారు ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నివారణలో ఒంటరిగానే వ్యవహారించిన హైడ్రా ఈ దిశగా సమన్వయ సమకూర్చుకుంటుందా? ఇతర శాఖలు హైడ్రాకు సహకరిస్తాయా? అన్నదే వేచి చూడాలి.

టెండర్ల ప్రక్రియలో పాల్గొంటారా?

దీనికి తోడు వర్షాకాలం సహాయక చర్యలు ముగిసినానంతరం పోస్ట్ మాన్సూన్ బాధ్యతలతో భాగంగా నాలాల్లోని పూడికతీత పనులను కూడా వచ్చే జనవరి మాసంలో హైడ్రానే చేపట్టాల్సి ఉంది. ఈ పనులు చేపట్టే ఏళ్ల తరబడి అనుభవమున్న కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీలో మాత్రమే ఉండగా, వీరు హైడ్రా చేపట్టే టెండర్ల ప్రక్రియలో పాల్గొంటారా? లేక హైడ్రా జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లను కాదని, వేరే కాంట్రాక్టర్లను టెండర్లకు ఆహ్వానిస్తుందా? హైడ్రా రేట్లకు జీహెచ్ఎంసీ యేతర కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకొస్తారా? అన్నది కూడా ఆసక్తి కరంగా మారింది.

 Also Read: KTR: సీడ్ కంపెనీల.. అక్రమాలను అడ్డుకోవాలని!

Just In

01

Hyderabad Police: నమ్మించి పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి.. బంగారు ఆభరణాలు చోరీ!

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..

Jupally Krishna Rao: బంగ్లాదేశ్ అవతరణకు కారణం అదే.. ఇందిరా గాంధీ నాయకత్వాన్ని గుర్తుచేసిన జూపల్లి!

GHMC Council: వాడివేడిగా కౌన్సిల్ సమావేశం.. పార్టీలకతీతంగా పునర్విభజనపై సభ్యుల ప్రశ్నల వర్షం!

TG Panchayat Elections 2025: ప్రశాంతంగా పంచాయతీ పోలింగ్.. ఉత్సాహాంగా ఓట్లు వేస్తోన్న పల్లెవాసులు