GHMC( image credit: twitter)
హైదరాబాద్

GHMC: బౌన్స్ బకాయిల వసూళ్లకు.. యాక్షన్ ప్లాన్!

GHMC: గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ది, మౌలిక వసతుల కల్పన, పౌర సేవల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించే జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి చెల్లింపుదారులు సమర్పించిన చెక్ బౌన్స్ లపై జీహెచ్ఎంసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ. 2038 కోట్ల వరకు రికార్డు స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్న బల్దియా ఆస్తుల యజమానులు సమర్పించిన సుమారు రూ.63 కోట్ల విలువైన దాదాపు 6032 చెక్కు లు బౌన్స్ అయినట్లు సమాచారం.

1508 చెక్కు లు కూడా బౌన్స్

గత ఆర్థిక సంవత్సరం (2024-25) లో కలెక్షన్ అయిన ట్యాక్స్ మొత్తం రూ. 2038 కోట్లలో రూ. 63 కోట్లు ఇంకా బల్దియా ఖజానాలో క్రెడిట్ కాలేదని అధికారులు గుర్తించారు. అలాగే వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) లో కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు ట్యాక్స్ చెల్లిస్తూ బకాయిదారులు సమర్పించిన సుమారు రూ.7 కోట్ల విలువైన దాదాపు 1508 చెక్కు లు కూడా బౌన్స్ అయినట్లు అధికారులు గుర్తించారు. గత, వర్తమాన ఆర్థిక సంవత్సరాల్లో కలిపి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి వచ్చిన సుమారు రూ. 70 కోట్ల విలువైన దాదాపు 7540 చెక్కు లకు సంబంధించిన బకాయిలను వసూలు చేసే బాధ్యతలను కమిషనర్ సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తూ సర్క్యులర్ కూడా జారీ చేసినట్లు సమాచారం.

అవసరమైన చోట డిప్యూటీ కమిషనర్లు బకాయి వసూళ్ల కోసం ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో కలిపి కమిటీలను నియమించుకుని బకాయిలు వసూలు చేసే చర్యలు చేపట్టాలని కూడా సర్క్యులర్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఇదే తరహాలో ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి సమర్పించిన చెక్కులు బౌన్స్ కావటంతో అప్పటి కమిషనర్ రోనాల్డ్ రోస్ చెక్కులు ఇచ్చిన ఆస్తుల యజమానులపై కేసులు కూడా నమోదు చేయించిన సందర్భాలున్నందున, చెక్కుల ద్వారా బకాయిపడ్డ ప్రాపర్టీ ట్యాక్స్ త్వరలోనే మొత్తం వసూలవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.

 Also Read: Maoists: పోలీసుల వాహనాన్ని.. పేల్చిన మావోయిస్టులు!

టార్గెట్ @ రూ.2500 కోట్లు
వర్తమాన ఆర్ధిక సంవత్సరం ( 2025-26)నకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మరింత పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ ఈ సారి ముందస్తుగానే వ్యూహాం రచించింది. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగింపు 2026 మార్చి చివరి కల్లా రూ.2500 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ గా నిర్ణయించినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం రూ. 150 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు టార్గెట్ ను పెంచుకునే జీహెచ్ఎంసీ ఈ సారి ఏకంగా రూ. 462 కోట్ల టార్గెట్ ను ఏకంగా పెంచుకుంది.

9 లక్షల ఆస్తులపై సర్వే పూర్తి

ఈ సారి జీహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తులపై జీయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే( జీఐఎస్) జరుగుతుండటం, ఇప్పటి వరకు దాదాపు 9 లక్షల ఆస్తులపై సర్వే పూర్తి కావటంతో చాలా ఆస్తులకు సంబంధించి అదనపు అంతస్తులు, వినియోగంలో మార్పు వంటివి వెలుగు చూడటంతో వాటన్నింటిని కూడా ట్యాక్స్ చెల్లింపు పరిధిలోకి తీసుకువచ్చి వచ్చే మార్చి నెలాఖరు కల్లా రూ.2500 కోట్ల కలెక్షన్ మార్కు దాటేలా అధికారులు స్కెచ్ సిద్దం చేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగానే కొత్త నూతన సంవత్సరం (2025-26) ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే నెలాఖరు వరకు రూ.909 కోట్లు, అలాగే ఒక్క జూన్ మాసంలోనే 1వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు రూ. 109 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ చేసి కొత్త సంవత్సరం ట్యాక్స్ కలెక్షన్ రూ. 1018 కోట్లకు పెంచుకున్నారు. గతేడాది జూన్ 8వ తేదీ నాటికి జరిగిన ట్యాక్స్ కలెక్షన్ తో పోల్చితే ఈ సారి రూ. 109 కోట్ల కలెక్షన్ అధికంగా చేసినట్లు అధికారులు తెలిపారు.

 Also Read: Land Encroachments: ఫేక్‌ నోటరీలతో భూ ఆక్రమణలు.. ఓ కాంగ్రెస్ నేత అంతులేని ఆగడాలు!

Just In

01

Karthik Gattamneni: తొమ్మిది గ్రంథాలు దుష్టుల బారిన పడితే.. ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?