Maoists( image credit: twitter)
తెలంగాణ

Maoists: పోలీసుల వాహనాన్ని.. పేల్చిన మావోయిస్టులు!

Maoists: చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు.  సుక్మా జిల్లాలో మావోయిస్టులు ప్రెషర్బాంబు అమర్చి పోలీసుల వాహనాన్ని పేల్చి వేశారు. ఈ ఘటనలో ఏ ఎస్ పి ఆకాశరావు మృతిచెందగా డి.ఎస్.పి, కుంట సీఐలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ కగార్ లో భాగంగా భద్రతా దళాలు మావోయిస్టుల ఎరివేత కోసం చేస్తున్న కూంబింగ్లలో భాగంగా సోమవారం మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. దాదాపు మావోయిస్టులను బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల్లో పర్యటిస్తున్న మావోయిస్టులను ఒక్కొక్కరిగా భద్రత బలగాలు మట్టు పెడుతూ వస్తున్నాయి.

 Also Read: HC Lawyer Kidnap case: హైకోర్టు న్యాయవాది కిడ్నాప్.. కోటి రూపాయల డిమాండ్!

రక్షించుకునేందుకు ప్రెషర్ బాంబులు

ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు నుండి తమను తాము రక్షించుకునేందుకు ప్రెషర్ బాంబులను భూ భాగంలో పాతిపెట్టారు. పాత పెట్టిన ప్రెషర్ బాంబులను భద్రతా బలగాల రాకను చూసి పేల్చివేసినట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపు వందల సంఖ్యలో మావోయిస్టులు భద్రతా దళాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. ముఖ్యంగా ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు, మరొకరు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందడం గమనార్హం.

గాయాలతో అక్కడికక్కడే మృతి

ఇంకా మిగిలి ఉన్న కేంద్ర కమిటీ సభ్యులు 15 మంది టార్గెట్గా భద్రత బలగాలు కూంబింగ్ లను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్న భద్రత బలగాల వాహనం రాకను చూసి ఐ ఈ డి బాంబులను మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో ఏ ఎస్ పి ఆకాష్ రావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లుగా సమాచారం ద్వారా తెలుస్తోంది.

అంతేకాకుండా డి.ఎస్.పి, కుంట పోలీస్ స్టేషన్ కి చెందిన సీఐ లకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా బలగాలు మిగతా వాహనాల్లో ఉన్న పోలీసులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా తక్షణ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఐ ఈ డి బాంబు పేల్చివేసిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 Also Read: bhadradri kothagudem: ఆదివాసుల బాధలు.. తీర్చేవారే లేరా..?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!