Renna O Rourke
Viral, లేటెస్ట్ న్యూస్

Dusting Challenge: తెరపైకి కొత్త ఛాలెంజ్.. టీనేజర్ బలి

Dusting Challenge: సోషల్ మీడియా (Social Media) యుగంలో ‘ఐస్ బకెట్ ఛాలెంజ్’తో పాటు (Ice bucket challenge) ఇప్పటికే ఎన్నో వింత పోకడలు తెరపైకి వచ్చాయి. తాజాగా అమెరికాలో (USA) మరో కొత్త ఛాలెంజ్ పుట్టుకొచ్చింది. దానిపేరు ‘డస్టింగ్ ఛాలెంజ్’ (Dusting Challenge). ‘క్రోమింగ్’ లేదా ‘హఫింగ్’ అని కూడా పిలిచే ఈ ఛాలెంజ్‌‌లో సరదాతనం, చిన్నపాటి ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్‌ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కద్వారా పీల్చుతున్నారు. అమెరికా టిక్‌టాక్‌లో ఈ ఛాలెంజ్ ట్రెండింగ్‌గా మారింది. ఆరిజోనాకు చెందిన 19 ఏళ్ల రెన్నా రూర్కే (Renna O’Rourke) అనే ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్ విసిరిన ‘డస్ట్ ఛాలెంజ్‌’ను స్వీకరించి ప్రాణాలు కోల్పోయింది.

రూర్కే ఎలా చనిపోయింది?
డస్టింగ్ ఛాలెంజ్ ప్రమాదకరమైనదే అయినప్పటికీ అమెరికాలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. రెన్నా రూర్కే ప్రాణాలు కోల్పోయి విషయానికి వస్తే, బాయ్‌ఫ్రెండ్ విసిరిన ఛాలెంజ్‌ను ఆమె గుడ్డిగా స్వీకరించింది. తన తల్లిదండ్రులకు తెలియకుండా ఒక డెలివరీ సర్వీస్ ద్వారా ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్‌ను ఆర్డర్ చేసింది. హానికరమైన స్ప్రే పొగలను ముక్కు ద్వారా పీల్చింది. దీంతో, కొద్దిసేపటికే ఆమెకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమవంతు ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమెకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని గుర్తించారు. దాదాపు వారం రోజులు అపస్మారక స్థితిలోనే ఉంది. ఆ తర్వాత చనిపోయింది.

Read this- Elon Trump News: మస్క్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్

ఫేమస్ కావాలని ఇంతపని
అన్నా రూర్కే మృతిపై ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. చిన్నవయసులోనే మృతి చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెన్నా తల్లిదండ్రులు ఆరోన్, డానా మాట్లాడుతూ, తమ కూతురు రూర్కే తెలివితక్కువ ఛాలెంజ్‌కు బలైందని వాపోయారు. ‘‘నువ్వు చూస్తుండు. నేను కచ్చితంగా ఫేమస్ అవుతానంటూ రూర్కే చెబుతుండేది. ఫేమస్ కావాలనే కోరిక ఆమెకు బాగా ఉండేది. ఫేమస్ కావాలనే కోరికే చివరికు ఇంతటి విషాదానికి దారితీసింది. ఇలాంటి ముగింపుకు దారితీస్తుందని ఎవరికి మాత్రం తెలుసు?. మా కూతురు మాదిరిగా మరొకరికి ఈ పరిస్థితి ఎదురుకాకుండా ‘డస్టింగ్ ఛాలెంజ్’పై అవగాహన పెంచుతాం’’ అని ఆరోన్, డానా చెప్పారు.

Read this- Samantha: నాగ చైతన్య నా ఫస్ట్ లవ్ అంటూ మళ్లీ ఓపెన్ అయిన సమంత

డస్టింగ్ ఛాలెంజ్ ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు రూర్కే వైద్య, ఖనన ఖర్చుల భారాలను భరించలేని స్థితిలో ఉన్నామని, ఇందు కోసం ‘గోఫండ్‌మీ’ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్టు ఆరోన్, డానా తెలిపారు. దిగ్భ్రాంతి కలగజేస్తున్న ఈ ఘటన పట్ల తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు ఇలాంటి ప్రాణాంతకమైన ఛాలెంజ్‌లు స్వీకరించి బలవ్వకుండా చూసుకోవాలని సూచించారు. తెలివితక్కువ సోషల్ మీడియా ట్రెండ్‌ను పిల్లలు అనుసరించకుండా అవగాహన కల్పించాలని, తమ కూతురి ఉదంతం ఒక మేల్కొలుపు పిలుపుగా భావించాలని వ్యాఖ్యానించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!