EC Rahul Gandhi
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Election Commission: రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్ ఫుల్ సీరియస్

Election Commission: గతేడాది నవంబర్ నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharastra Elections) మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, బీజేపీకి (BJP) అనుకూలంగా రిగ్గింగ్‌ జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ (Congress MP) ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) సీరియస్ అయ్యింది. రాహుల్ గాంధీ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. మహారాష్ట్ర ఎన్నికలు, ఫలితాలపై అనుమానాలను నివృత్తి చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేసిన డాక్యుమెంట్‌ను మరోసారి రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ, ఆ పార్టీ నియమించిన ఏజెంట్లు గానీ ఓటింగ్ సమయంలో ఎలాంటి తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పేర్కొంది.

‘‘ప్రతి పోలింగ్ బూత్‌లోనూ అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీలు అధికారికంగా నియమించిన పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నామినేట్ చేసిన అభ్యర్థులు, లేదా వారు నియమించిన ఏజెంట్లు ఓటింగ్ జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి (RO), ఎన్నికల పరిశీలకులకు ఓటింగ్‌పై ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు. ఓటర్ల జాబితాలో కొత్తవారిని చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏ పార్టీ కూడా అభ్యంతరాలు చెప్పలేదు. అలాంటి ఫిర్యాదులు అందలేదు’’ అని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.

Read this- Mobile Blast News: సెల్‌ఫోన్ పేలి సాఫ్ట్‌వేర్ సజీవ దహనం.. అతడి మిస్టేక్ ఇదే!

మహారాష్ట్ర ఎన్నికల సమయంలో ఓటర్ల తుది జాబితాలు ఖరారు చేశాక మొత్తం 9,77,90,752 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, 1వ అప్పీలేట్ అథారిటీకి కేవలం 89 అప్పీళ్లు, 2వ అప్పీలేట్ అథారిటీ ముందు 1 అప్పీల్ మాత్రమే దాఖలయ్యాయని వివరించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, లేదా మరే ఇతర రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు అందలేదని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.

వాస్తవాలు విస్మరిస్తున్నారు
బూత్ స్థాయి ఏజెంట్లను కూడా రాజకీయ పార్టీలే నియమించుకుంటాయని, కాంగ్రెస్ పార్టీ 27,099 మంది ఏజెంట్లను నియమించుకుందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఈ వాస్తవ గణాంకాలను విస్మరించి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన అన్ని వాస్తవాలను కాంగ్రెస్ పార్టీకి 2024 డిసెంబర్ 24న అందించామని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో ఇప్పటికీ ఆ డేటా అందుబాటులో ఉందని పేర్కొంది. ఎలక్షన్ కమిషన్‌పై పదేపదే ఆరోపణలు చేస్తున్నవారు కళ్ల ముందే ఇన్ని వాస్తవాలు కనిపిస్తున్నా పట్టించుకోవడంలేదని ఈసీ అసహనం వ్యక్తం చేసింది. చట్టప్రకారం ఎన్నికలు జరుగుతాయని, కచ్చితత్వంతో నిర్వహిస్తున్న మన ఎన్నికల విధానాలను ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయనే విషయాన్ని గమనించాలని సూచించింది.

Read this- Mobile Blast News: సెల్‌ఫోన్ పేలి సాఫ్ట్‌వేర్ సజీవ దహనం.. అతడి మిస్టేక్ ఇదే!

తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడమంటే చట్టాలను అగౌరవపరచడమే కాకుండా, తమ నేతలనే రాజకీయ పార్టీలు అవమానపరిచినట్టు అవుతుందని ఎలక్షన్ కమిషన్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సమయంలో నిర్విరామంగా, పారదర్శకంగా పనిచేసిన లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని నిరుత్సాహపరిచినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. ‘‘ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాక, ఎన్నికల కమిషన్‌పై నిందలు వేయడం పూర్తిగా అసంబద్ధం’’ అని ఎలక్షన్ కమిషన్ వ్యాఖ్యానించింది.

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?