Rahul Gandhi Election Rigging
Uncategorized

Rahul Gandhi: మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi:లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి మహారాష్ట్ర ఎన్నికల (Maharastra Elections) ఫలితాలపై సంచలన ఆరోపణలు చేశారు. గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి (BJP) అనుకూలంగా రిగ్గింగ్ జరిగిందని అన్నారు. ‘మ్యాచ్-ఫిక్సింగ్ మహారాష్ట్ర’ అనే టైటిల్‌తో ఓ జాతీయ దినపత్రికకు రాసిన కాలమ్‌ క్లిప్పింగ్‌ను జోడిస్తూ ఎక్స్ వేదికగా శనివారం ఆయన స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రిగ్గింగ్ జరిగినట్టుగా తాను నమ్ముతున్నాంటూ దశలవారీగా ఆయన వివరించారు. ‘‘ఎన్నికలను ఎలా దొంగిలించాలి? అంటే, 2024లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్య దొంగతానికి ఒక బ్లూప్రింట్ లాంటిది’’ అని రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను (Bhihar Assembly Elections) కూడా రిగ్గింగ్ చేయాలని బీజేపీ చూస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ తర్వాత బీహార్‌కు వచ్చేస్తుంది. ఇక, ఎక్కడైనా బీజేపీ ఎందుకు ఓడిపోతుంది’’ అని ఆయన రాసుకొచ్చారు.

Read this- Cm Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలకు షాక్.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

5 దశల్లో అమలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాలను ఏమార్చడానికి బీజేపీ సమగ్రమైన ఐదు దశల ప్రక్రియను పక్కాగా అమలు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల నిర్వహణ అంశాలు తమకు అనుకూలంగా ఉండేందుకుగానూ 2023లో ఎలక్షన్ కమిషనర్ల నియామక ప్రక్రియలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలకమైన సవరణలు చేసిందని, ఈ మేరకు నూతన చట్టాన్ని కూడా తీసుకొచ్చిందని ఆయన ప్రస్తావించారు. అంపైర్ల నియామకం కోసం కమిటీని రిగ్గింగ్ చేశారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల కమిషనర్ల నియామక నూతన చట్టం ప్రకారం, ఎంపిక కమిటీ కేంద్రానికి అనుకూలంగా ఉంటుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాగా, నూతన చట్టం ప్రకారం, ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభ్యులుగా ఉంటారు. ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిషనర్ల పేర్లను రాష్ట్రపతికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది.

Read this- Central on Maoists: మావోయిస్టుల పతనం పూర్తయినట్టేనా.. చివరి అధ్యాయం మాత్రమే మిగిలిందా!

సీజే బదులు మంత్రి ఎందుకు?
ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో కేంద్ర కేబినెట్ మంత్రికి చోటివ్వడంపై రాహుల్ గాంధీ ఆశ్చర్యం, అనుమానం వ్యక్తం చేశారు. ఒక కీలకమైన వ్యవస్థీకృత సంస్థలో తటస్థ మధ్యవర్తిగా ఉన్న ఓ వ్యక్తిని ఎవరైనా ఎందుకు సాహసం చేస్తారని ఆయన ప్రవ్నించారు. ఇక, రెండవ, మూడవ దశలలో ఓటర్ల జాబితాలను నకిలీ ఓటర్లతో నింపివేశారని ఆయన ఆరోపించారు. ఓటింగ్ ముగిసిన తర్వాత ఓటర్ల సంఖ్య అసాధారణ రీతిలో 7.83 శాతం మేర ఎలా పెరిగిందని ఆయన ప్రశ్నించారు. 7.83 శాతం అంటే 76 లక్షల ఓట్లతో సమానమని ఆయన చెప్పారు. చివరి రెండు దశలలో బీజేపీ గెలవాలనుకున్నచోట బోగస్ ఓట్లపై దృష్టిసారించిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను దాచిపెట్టిందని ఆయన ఆరోపించారు.

Read this- Deepika padukone: పెళ్ళి తర్వాత కూడా దీపికా నాతో చాలా సార్లు అలా చేసేదంటూ.. మాజీ ప్రియుడు షాకింగ్ కామెంట్స్

రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ, రాహుల్ గాంధీ లక్ష్యం స్పష్టంగా లేదని, గందరగోళంగా ఉందని కౌంటర్ ఇచ్చారు. దేశ సంస్థాగత విధానాలపై ఓటర్ల మనస్సులలో సందేహం, భిన్నాభిప్రాయాలను నాటేందుకు రాహుల్ గాంధీ పదేపదే ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాపై ఆరోపణలను ఎన్నికల సంఘం గతంలోనే తోసిపుచ్చిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా, మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించిన, కొన్ని నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఊహించని మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీ మిత్రపక్షాలు ఏకంగా 288 స్థానాల్లో ఏకంగా 235 సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్, మిత్రపక్షాలు ఊహించని పరాభావాన్ని చవిచూడాల్సి వచ్చింది.

 

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?