OlA bike Ride
Viral, లేటెస్ట్ న్యూస్

Unusual Ola Ride: పక్కవీధిలోకి ఓలా బైక్ బుకింగ్.. కారణం విని షాకైన రైడర్

Unusual Ola Ride: సాధారణంగా అయితే నడిచివెళ్లడానికి కష్టతరమైన దూరాలకే ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) వంటి రైడింగ్ సర్వీసులను వినియోగదారులు ఆశ్రయిస్తుంటారు. కానీ, 3-4 నిమిషాల్లో నడిచి వెళ్లే 180 మీటర్ల స్వల్ప దూరానికే ఓ యువతి ఓలా బైక్‌ను (Ola Bike Ride) బుకింగ్ చేసుకొని, గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వైరల్ వీడియో(Viral Video) సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాలు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

Read this- IPL Star Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత స్టార్ క్రికెటర్

వీధికుక్కల భయంతో..
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన సదరు యువతి వీధి కుక్కలకు భయపడింది. వాటి మధ్య నుంచి నడిచి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం కంటే, బైక్ రైడింగ్‌ను బుక్ చేసుకొని సురక్షితంగా గమ్యస్థానానికి వెళ్లడమే మేలు అని భావించింది. అనుకున్నట్టుగానే ఓలా బైక్‌ను బకింగ్ చేసుకుంది. రైడర్ ‘పికప్ పాయింట్’ వద్దకు చేరుకొని ఓటీపీ నంబర్ చెప్పాలంటూ యువతిని కోరాడు. ఓటీపీ ఎంటర్ చేసి చూడగా కేవలం 180 కిలోమీటర్ల దూరంలోనే గమ్యస్థానం కనిపించింది. గమ్యస్థానం కేవలం పక్కవీధి అంత దూరంలో ఉన్నట్టుగానే కనిపించింది. దీంతో, రైడర్ ఒకింత ఆశ్చర్యం, గందరగోళానికి గురయ్యాడు. పొరపాటున తప్పుగా లోకేషన్‌ను బుక్ చేసుకున్నారేమోనని భావించిన యువతిని అడిగాడు. అబ్బే అదేమీ లేదు, కరెక్ట్‌గానే బుకింగ్ చేసుకున్నానంటూ యువతి చెప్పడంతో రైడర్ అవాక్కయ్యాడు. అదేంటి మరి, ఇంత తక్కువ దూరానికి ఎందుకు బుకింగ్ చేసుకున్నారని ప్రశ్నించగా, వీధి కుక్కలకు భయపడి అని యువతి సమాధానం ఇచ్చింది.

దూరం తక్కువే.. ఎక్కులే ఎక్కువ
తాను వెళ్లాల్సిన దూరం తక్కువే, కానీ కుక్కలే ఎక్కువని యువతి వాపోయింది. అందుకే, రైడ్ బుక్ చేసుకున్నానంటూ సమాధానమిచ్చింది. దీంతో, తన డ్యూటీలో భాగంగా డ్రైవర్ ఆమెను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. రైడింగ్‌కుగానూ రూ.19 ఛార్జీ చెల్లించి యువతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. యువతి అసాధారణ 180 మీటర్ల బైక్ రైడ్‌కు సంబంధించిన వీడియోను బైక్ రైడర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

Read this- PM Narendra Modi: పాకిస్థాన్ టార్గెట్ అదే.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

మేడమ్ బుకింగ్..
‘‘మేడమ్, కేవలం 180 మీటర్ల దూరానికే ఓలా బైక్ బుక్ చేసుకున్నారు’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో, ఈ వీడియో వెంటనే వైరల్‌గా మారింది. రెండున్న రోజుల్లోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్, 2.93 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది స్మైలీ ఎమోజీలను కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ, యువతిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన రైడర్‌కు థ్యాంక్స్ అంటూ పలువురు కామెంట్ చేశారు. కుక్కల దాడిలో గాయపడడం కంటే రూ.19 చెల్లించడం మేలేనని పలువురు వ్యాఖ్యానించారు. యువతి చేరుకోవాల్సిన చోట ఏదైనా శునకం వేచి ఉండుంటే ఆమె పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అంటూ మరో నెటిజన్ చమత్కరించాడు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!