Mother: అవును.. ఇది ముమ్మాటికీ సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే ఘోరాతి ఘోరం. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లే కుమార్తెను కాటేసింది! కామంతో కళ్ళుమూసుకుపోయి తాను తప్పు చేయడమే ఘోరం అన్న సంగతి మరిచి ప్రియుడి కోసం తన కన్న కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేసింది ఓ దుర్మార్గురాలు. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు ఆమే కన్న కూతురిపై కన్నేశాడు. మైనార్టీ కూడా తీరని ఆ బాలిక (13)ను ప్రియుడు, అతని స్నేహితులు గ్యాంగ్ రేప్ చేయడానికి సహకరించింది. అమ్మా.. అమ్మా అని అరిచినా సరే ఆ తల్లి మనసు కరగలేదు. ప్రియుడి కోసం బరితెగించి ఇలా ప్రవర్తించింది. ఇప్పుడు చెప్పండి.. ఇలాంటి తల్లి ఎవరికైనా అవసరమా? అసలు ఇలాంటి వారికి భూమ్మీద ఉండే అర్హత ఉందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
పైకి రాజకీయం.. లోలోపల..!
ఇదిగో ఆ తల్లి మరెవరో కాదు.. బీజేపీ మహిళా నేత. హరిద్వార్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు అనామిక శర్మ. తన భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె.. ప్రియుడితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నది. ఈ ఏడాది జనవరిలో తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి టూర్‌కి వెళ్లింది అనామిక. 13 ఏళ్ల కుమార్తెను కూడా వెంట తీసుకెళ్లింది. ఎప్పట్నుంచో ఆమె కుమార్తెపై కన్నేసిన ఆ కామాంధుడు.. కోరిక తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించాడు. అయితే ఈ విషయం తెలిసినా ఆ దుర్మార్గపు తల్లి కనీసం అడ్డు చెప్పుకోవడం గమనార్హం. కూతురిని ప్రియుడు, అతని స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించింది. కూతురిని గ్యాంగ్ రేప్ చేయడానికి అనామిక అన్ని విధాలుగా సహకరించింది. అంతేకాదు ఈ విషయం బయట ఎవరికైనా తెలిసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తామని తల్లి, ఆమె ప్రియుడు వార్నింగ్ ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంత దారుణాతి దారుణమో. నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విషయమే. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు గురువారం నాడు అనామిక శర్మను అరెస్టు చేశారు. మరోవైపు ఆమె ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫ్రెండ్స్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చూశారుగా.. చేసేదేమో పాలిటిక్స్.. లోలోపల మాత్రం ఎంత పాడు పనులు ఉన్నాయో..!
Read Also- Manchu Vishnu: మంచు విష్ణు ఫోన్‌లో హాట్ లేడీ ఫోన్ నంబర్.. ఎవరో తెలిస్తే?
వెంటనే పదవి హుష్!
అనామిక పేరు బయటికి రాగానే బీజేపీ హైకమాండ్ తక్షణ చర్యలు తీసుకున్నది. వెంటనే ఆమె పదవిని, పార్టీ సభ్యత్వాన్ని తొలగించారు. అయితే.. ఆగస్టు 2024 నుంచి అనామిక పార్టీలో ఏ పదవిలో లేరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, అనామిక తన భర్త నుంచి విడిపోయిన తర్వాత ప్రియుడితో కలిసి కొన్నిరోజులుగా హోటల్‌లో ఉంటోంది. తల్లితో కలిసి కూతురు ఉండగా.. ఆ బాలికపై కామాంధుడి కన్ను పడింది. తల్లి ముందే ఇప్పటికే ఎనిమిది సార్లు అత్యాచారం చేశాడని, ఇదంతా ఆమె సమక్షంలో జరిగిందని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అలా నెలల తరబడి ఈ బాధలను భరించిన బాధితురాలు చివరికి తన తండ్రికి బాధ చెప్పి కన్నీరుమున్నీరైంది. తండ్రి ఫిర్యాదుతో BNS సెక్షన్లు 70(2), 351(3), 3(5), పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన పోలీసులు.. మూడో నిందితుడిని అరెస్టు చేయడానికి టీమ్‌ను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. బహుశా ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? అంటే ఇదిగో ఇలాంటి వాళ్లను చూసిన తర్వాత ఉంటారేమో అనిపిస్తుంది అంతే..!
Read Also- Ram Gopal Varma: వర్మ అరాచకం.. మెగా ఫ్యామిలీపై మళ్లీ..!