Biryani: అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే ఇకపై విద్యార్థులకు బిర్యానీ, పులావ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా నాలుగేళ్ల బాలుడు కోరిన కోరికతో సాధ్యమైంది. ఉప్మాకు బదులు బిర్యానీ కావాలని ఓ వీడియోలో కోరగా.. అది కాస్త వైరల్‌గా మారింది. సీన్ కట్ చేస్తే ఆ బాలుడి కోరికను నెరవేర్చడంతో పాటు.. అన్ని అంగన్వాడీల్లో ఇదే అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. పూర్తి వివరాల్లోకెళితే.. కేరళలోని అలప్పుజకు చెందిన శంకు అనే నాలుగేళ్ల బుడతడు ఉప్మాకు బదులుగా బిర్యానీ కావాలని, చికెన్ ఫ్రై (Chicken Fry) కూడా కావాలని అడిగాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన తల్లికి ఇంటి వద్ద బిర్యానీ తింటూ శంకు ఈ కోరికను తెలియజేశాడు. ఈ అమాయకమైన, హృదయాన్ని హత్తుకునే వీడియోను అతని తల్లి అశ్వతి అశోక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ వీడియో కేరళ ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ (Veena George) దృష్టికి వెళ్లింది.
Read Also- Savitri: షాకింగ్.. సావిత్రి బంగారు నగలు కొట్టేసిన ‘నటుడు’ ఎవరు?
హామీ ఇస్తున్నా..
శంకు విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మహిళా, శిశు సంక్షేమ శాఖ వివిధ స్థాయిల్లో చర్చలు జరిపి అంగన్వాడీల (Anganwadi Centers) ఆహార మెనూను సవరించారు. మంగళవారం అంగన్వాడీ పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొత్త మెనూను అధికారికంగా ప్రకటించారు. ఈ మెనూలో ఎగ్ బిర్యానీ (Egg Biryani), పులావ్, దాల్ పాయసం, సోయా డ్రై కర్రీ, లడ్డూలు వంటి రుచికరమైన, పోషకమైన వంటకాలు ఉన్నాయి. కాగా, అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ ఒకే రకమైన మెనూ అమలుచేయడం ఇదే తొలిసారని వీణా జార్జ్ హ్యాపీగా ఫీలవుతూ చెప్పారు. అంతేకాదు.. ఇప్పటివరకు వారానికి రెండుసార్లు అందించే పాలను ఇకపై మూడుసార్లు అందిస్తామని మంత్రి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఈ కొత్త మెనూ వల్ల పిల్లలకు మరింత ప్రోటీన్ పోషకాలను అందనున్నాయి.
Read Also- Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందా?
మొత్తానికి చూస్తే.. కేరళ ప్రభుత్వం ఈ మార్పుల ద్వారా అంగన్వాడీ పిల్లలకు మరింత రుచికరమైన, పోషకమైన ఆహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు ఇష్టమైన ఆహారాన్ని అందించడం ద్వారా వారు అంగన్వాడీలకు రావడానికి ఆసక్తి చూపుతారని, తద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి మరింత తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా, శంకు చేసిన చిన్న కోరిక పెద్ద మార్పుకు నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఇదే మెనూను మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఎందుకంటే అటు పోషకాహారాలు అందించడంతో పాటు.. ఇటు అంగన్వాడీలకు రావడానికి పిల్లలు ఆసక్తి చూపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రయత్నం చేస్తే బాగుటుందని నిపుణులు సైతం చెబుతున్నారు.
Read Also- Chandrababu: ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా.. ఆ మంత్రులపై చంద్రబాబు తీవ్ర అసహనం!