Pawan Kalyan
Politics, ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: ఈశ్వరా.. పవనేశ్వరా ముఖ్యమంత్రి అయ్యేదెప్పుడు?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YSR Congress) ప్రభుత్వం పోయి.. ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నేటికి ఏడాది. ఈ సందర్భంగా అటు వైసీపీ మాత్రం హామీలు నెరవేర్చలేదని ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తుండగా.. ఇటు కూటమి పార్టీలు మాత్రం సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే అన్నీ సరేకానీ.. తమరు సీఎం అయ్యేదెప్పుడు? సంపూర్ణం విజయం అంటేనే ముఖ్యమంత్రి అయ్యాక అంటూ అభిమానులు, కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ పవన్ చేసిన ట్వీట్ ఏంటి? జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు కోరుకుంటున్నది ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also- EPFO Withdraw: ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో పండుగ లాంటి శుభవార్త!

ప్రజా చైతన్యానికి ఏడాది..
ప్రజా తీర్పుకు ఏడాది పూర్తి అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘ ప్రజా చైతన్యానికి ఏడాది.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది. ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది. జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది. 04/06/2024 ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు. 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలిచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Read Also- Pawan Kalyan: లోకేష్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. కళ్ళకు కట్టినట్లుగా!

రానున్న రోజుల్లో..
మీరు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం. గత తప్పిదాలను సరిచేస్తూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా జనసేన- తెలుగుదేశం- బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, తెలుగుదేశం (TDP), బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఎక్స్‌లో పవన్ తెలిపారు.

Pawan Kalyan Signature

ఇదే ప్రజాభీష్టం..!
ఈశ్వరా పవనేశ్వరా..! జనసేనాని కళ్యాణ్ ముఖ్యమంత్రి (Chief Minister) అయినప్పుడే సంపూర్ణ విజయం సాధించినట్లు. ఆరోజే మనది అవుతుంది. అప్పుడు చేసిన సంబరాలకే కిక్ ఉంటుంది. సంపూర్ణ విజయమే మన లక్ష్యం. ఇదే ప్రజాభీష్టం.. ఇదే అక్షర సత్యం’ అని ఆకాంక్షిస్తూ జనసైనికులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. డీఎస్సీ అభ్యర్థులతో (DSC) దయచేసి ఒక్కసారి మాట్లాడండి సార్, కూటమికి ఇంతటి విజయం ఇచ్చిన వారి బాధ వినండి అంటూ సొంత పార్టీ కార్యకర్తలే విజ్ఞప్తి చేస్తున్నారు కూడా. మరోవైపు.. వైసీపీ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తునే ఈ ట్వీట్‌కు స్పందిస్తున్నారు. ‘ 2019లో నిన్ను రెండు చోట్ల ఓడించినందుకు కూడా అంతేగా. ప్రజా తీర్పుకు 6 సంవత్సరాలు.. ప్రజా చైతన్యానికి 6 సంవత్సరాలు. ప్రజాస్వామ్య పరిరక్షణకు 6 సంవత్సరాలు. వైసీపీ చారిత్రక విజయానికి 6 సంవత్సరాలు. రాష్ట్రంలో సింగల్‌గా పోటీ చేసి 175 సీట్లుకు గాను 151 సీట్లు గెలుపొంది 6 సంవత్సరాలు అంటూ సెటైర్లు, కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Also- Tollywood: పవన్ కళ్యాణ్‌ సినిమాలకు బ్రేక్ వేసిందెవరు?.. వైసీపీ కీలక నేత రివెంజేనా?

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది