CM SiddaRamaiah- Kohli (Image source Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

RCB Stampede News: తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన

RCB Stampede News: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్-2025 (IPL 2025) విజయోత్సవ వేడుకల సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తొక్కిసలాట ఘటన ఊహించని విషాదమని వ్యాఖ్యానించారు. ఆర్సీబీ ప్లేయర్లకు సన్మాన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) చేపట్టిందని స్పష్టం చేశారు.

Read this- RCB-BCCI: తొక్కిసలాటపై ఆర్సీబీ, బీసీసీఐ ఫస్ట్ రియాక్షన్

 

‘‘ఎం.చినస్వామి స్టేడియం సీటింగ్ కెపాసిటీ 35,000. కానీ, సుమారుగా 2 నుంచి 3 లక్షల మంది అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. విధాన సౌధ ముందు దాదాపుగా లక్షమంది అభిమానులు గుడిగూడారు, కానీ, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. కానీ, చినస్వామి స్టేడియం వెలుపల ఈ విషాద ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంతమంది అభిమానులు వస్తారని కనీసం క్రికెట్ అసోసియేషన్ కూడా ఊహించలేకపోయింది’’ అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పూర్తిస్థాయిలో విక్టరీ పరేడ్‌కు అనుమతులు ఇవ్వకుండా తిరస్కరించామని సిద్ధరామయ్య వివరించారు. విక్టరీ పరేడ్ చేపట్టేందుకు జట్టుకు అనుమతి ఇవ్వలేదని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

Read this, RCB Parade Stampede: ఆర్సీబీ విజయోత్సవాల్లో పెనువిషాదం.. 11 మంది కన్నుమూత

 

కుంభమేళాలో కూడా జరిగిందిగా..

దేశంలో చాలా చోట్ల తొక్కిసలాట ఘటనలు జరిగాయని సీఎం సిద్ధరామయ్య ఈ సందర్భంగా అన్నారు. కుంభమేళాలో కూడా తొక్కిసలాట జరిగిందని, అలాగని చినస్వామి వెలుపల జరిగిన విషాద ఘటనను తానేమీ సమర్థించుకోవడం లేదని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. గాయపడినవారికి ఉచిత చికిత్స అందించనున్నట్టు భరోసా ఇచ్చారు. తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. తొక్కిసలాట క్షతగాత్రులను బోర్వింగ్, వైదేహీ హాస్పిటల్స్‌కు వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో తాను మాట్లాడానని, క్షతగాత్రులు ఎవరికీ ప్రాణాపాయం లేదని చెప్పారని సిద్ధరామయ్య వెల్లడించారు. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని మీడియా సమావేశంలో తెలిపారు.

Read this, Samantha: సమంత మోసం చేస్తుంది.. డాక్టర్ ఫైర్!

 

సంతోషం.. విషాదాంతం
చినస్వామి వెలుపల జరిగిన తొక్కిసలాటపై ‘ఎక్స్’ వేదికగా కూడా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ‘‘ ఆనందకరమైన క్షణాలను విషాదం ఆవహించింది’’ అని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చనిపోయినవారికి నివాళులు అర్పిస్తున్నానని, బాధిత కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు. కాగా, బుధవారం మధ్యాహ్న సమయంలో బెంగళూరులోని ఎం.చినస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాట ఘటనలో ఏకంగా 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా అభిమానులు గాయాలపాలయ్యారు. స్టేడియంలో సన్మాన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో ఈ దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుంది.

Read this, Pottimama: ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ పొట్టిమామ గురించి తెలుసా?

Read this, BJP: పాకిస్థాన్ కూడా ఆ మాట వాడలేదు.. రాహుల్‌ గాంధీపై బీజేపీ తీవ్ర ఆగ్రహం

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది