Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రజలను, నెటిజన్లను తప్పుదారి పట్టిస్తుంది అంటూ ద లివర్ డాక్టర్ సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఫైర్ అయ్యారు. ఆమెకసలు సైన్స్ అంటే ఏంటో తెలుసా? ఎందుకు జనాలను మోసం చేస్తుంది?’ అంటూ సదరు డాక్టర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ట్వీట్‌కు కొందరు నెటిజన్లు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు ఆమె ఎక్స్‌పీరియెన్స్ చేసిన తర్వాతే చెబుతుంది కాబట్టి.. అనుమానాలు అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. సమంత ఎప్పుడో చేసిన పోస్ట్ తీసుకుని వచ్చి.. ఇప్పుడీ డాక్టర్ హడావుడి ఏంటి? అనేలా రియాక్ట్ అవుతుండటం విశేషం. మొత్తంగా అయితే మరోసారి సమంత వార్తలలో హైలైట్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే..
సమంత ఈ మధ్య మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. ఆమె విడాకులు తీసుకోవడానికి, కొన్నాళ్లు నటనకు దూరంగా ఉండటానికి.. తన లైఫ్ ఒక్కసారిగా టర్న్ కావడానికి కారణం ఈ వ్యాధే. ఈ వ్యాధి నుంచి ఎలా బయటపడాలా? అని ఆమె మనోవేదనను అనుభవించింది. ఎట్టకేలకు విదేశాలలో చికిత్స తీసుకుంటూ.. దాదాపు ఆ వ్యాధి బారి నుంచి బయటపడేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె తీసుకుంటున్న చికిత్సతో చాలా వరకు ఈ వ్యాధిని సమంత జయించింది. వ్యాధిని జయించింది కదా అని కామ్‌గా కూర్చోకుండా.. దీనిపై సోషల్ మీడియా వేదికగా నలుగురికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె చేసిన ఓ పోస్ట్‌పై కాంట్రవర్సీ నెలకొంది.
ఈ వ్యాధిని జయించే క్రమంలో ఏ మెడిసిన్స్ బాగా పని చేస్తున్నాయో చెబుతూ, ఎన్‌ఎమ్‌ఎన్ అనే బ్రాండ్‌ను ఆమె ప్రమోట్ చేసింది. ఇది శరీరంలోని ఎన్ఏడి స్థాయిలను పెంచుతుందని, వెంటనే కావాల్సిన శక్తి ఉత్పన్నమవుతుందని, ఏకాగ్రత మెరుగుపడేలా చేస్తుందని సమంత అప్పట్లో ఓ పోస్ట్‌లో పేర్కొంది. ఈ మందులను ఆమె తీసుకోవడమే కాకుండా, గటాకా సంస్థకు కో-ఫౌండర్‌గానూ మారానని, ఇది షార్ట్‌కట్స్ కోసం కాదు.. మీ భవిష్యత్ కోసం అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ పోస్ట్‌ని షేర్ చేసిన ద లివర్ డాక్టర్0.. సమంతపై ఫైర్ అయ్యారు. వృద్ధాప్యాన్ని తగ్గించి, ఎప్పుడూ యవ్వనంగా ఉంచే మందులు అంటూ సమంత నకిలీ మందులను ప్రమోట్ చేస్తుందనే పోస్ట్‌పై లివర్ డాక్టర్ విమర్శలు గుప్పించారు.
Also Read- Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ అడ్వాన్స్ వెనక్కి.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం
‘‘సమంతకు సైన్స్ తెలియదు. ఆమె ప్రమోట్ చేస్తున్న కంపెనీ వాస్తవమైనది కాదు. నాడ్ అనేది జీవక్రియకు ఒక ముఖ్యమైన కో ఎంజైమ్ మాత్రమే. ఎన్‌ఎమ్‌ఎన్ అనేది నాడ్ స్థాయిలను పెంచుతుందని, అనారోగ్యాన్ని దూరం చేస్తుందని ప్రచారంలో ఉన్న ఒక సప్లిమెంట్. కానీ, దీనిని వృద్ధాప్యాన్ని తగ్గించే దివ్యమైన ఔషధం అంటూ కొందరు మార్కెటింగ్ చేస్తున్నారు. అందుకు శాస్త్రీయ ఆధారాలు ఇంత వరకు ఎక్కడా లేవు. దీనివల్ల శరీరం ఉత్తేజం చెందుతుందే తప్ప అవయువాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. ఎలుకలపై నెలలపాటు ఎక్స్‌పర్‌మెంట్ చేసినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత చురుకుగా ఉన్నట్లుగా మాత్రమే తేలింది. అంతేకానీ వాటి ఆయుష్షు పెరిగిందనో, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమవుతాయనో అనేది మాత్రం నిరూపితం కాలేదు. పని చేయని మందులను వాడమని.. లక్షలాది అభిమానులను ఈ సైన్స్ తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? స్నేక్ ఆయిల్స్‌ని ప్రమోట్ చేసే వారితో జర జాగ్రత్తగా ఉండండి. నిజంగా మీకు వయసు కనిపించకుండా ఉండాలంటే చేయాల్సింది మెడిసిన్స్ తీసుకోవడం కాదు.. సరైన ఆహారశైలి, తగినంతగా వ్యాయామం, మంచి నిద్ర.. వీటిపై ఫోకస్ పెట్టి.. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. అంతేకానీ, ఎవరు పడితే వారు చెప్పిన మాటల్ని నమ్మకండి. నిజమైన సైన్స్ చెప్పే విషయాలను, అసలైన డాక్టర్స్ చెప్పే మాటల్నే వినండి’’ అని ద లివర్ డాక్టర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు