GHMC Council (imageredit:twitter)
హైదరాబాద్

GHMC Council: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్.. వాడీవే‘ఢీ’గా జరగనుందా?

GHMC Council: గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కోటిన్నర మంది జనాభాకు అవసరమైన అభివృద్దితో పాటు అత్యవసరమైన సేవలందించే జీహెచ్ఎంసీ పాలక మండలి సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం పదిన్నర గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో సమస్యలపై చర్చ జరుగుతుందా? లేక సభ్యుల మధ్య రచ్చ జరుగుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. పలు ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే దిశగా పాలక వర్గం వ్యూహాం ఏర్పాటు చేస్తుంటే, పాలక వర్గాన్ని ఇరకాటంలో పెట్టే దిశగా విపక్షాలకు చెందిన కార్పొరేటర్లు కూడా ప్రతి వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా స్టాండింగ్ కమిటీలో తిరస్కరించిన సీఆర్ఎంపీ-2 ప్రతిపాదనను నేటి కౌన్సిల్ సమావేశం ముందు పెట్టనున్నట్లు తెలిసింది.

సీఆర్ఎంపీ-1లో కేటాయించిన సుమారు 744.22 కి.మీ.ల రోడ్లకు మరిన్ని రోడ్లను జోడించి, మొత్తం 1142.54 కి.మీ.ల రోడ్ల నిర్వాహణను రానున్న అయిదేళ్ల పాటు (2025-2030) ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు, అందుకు రూ. 3825 కోట్లకు మంజూరీ కోరుతూ బుధవారం జరగనున్న కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ముందు ప్రతిపాదనలు పెట్టేందుకు అధికారులు, పాలక మండలి సిద్దం కావటం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి సభ్యుల నుంచి మొత్తం 120 ప్రశ్నలు రాగా, వీటిలో మేయర్ కౌన్సిల్ మీటింగ్ కోసం కేవలం 24 ప్రశ్నలను ఎంపిక చేసినట్లు సమాచారం. కానీ ఇటీవలే జీహెచ్ఎంసీలో వర్షం సహాయక చర్యల్లో భాగంగా సమకూర్చాల్సిన వాహానాల టెండర్లలో జరిగిన అక్రమాలపై కూడా మజ్లీస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారులను నిలదీసేందుకు ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఎదుర్కొనేందుకు అధికార పార్టీ వ్యూహాం

జీహెచ్ఎంసీలో కౌన్సిల్ లో సంఖ్యాబలం అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రేస్ పార్టీ విపక్షాల వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాన్ని రచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అధికార కాంగ్రేస్ పార్టీ ప్రవేశపెట్టనున్న పలు ప్రతిపాదనలను తిరస్కరించేందుకు ప్రధాన విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు సమాత్తమవుతుండగా, ప్రజాసమస్యలపై గళం విప్పి, అధికారుల తీరును ఎండగట్టేందుకు మజ్లీస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నుంచి మేయర్ గా కొనసాగుతున్న గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పొటీ చేసి గెలిచి, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో తొలుత డిప్యూటీ మేయర్, ఆ తర్వాత మేయర్ లు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీలో చేరిన విషయాన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ లను టార్గెట్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

Also Read: Covid-19 Cases India: కరోనా డేంజర్ బెల్స్.. ఏకంగా 4వేల కేసులు.. ఆందోళనలో ప్రభుత్వాలు!

లోకల్ ఫైట్ తర్వాత ఫస్ట్ మీటింగ్

ఇటీవలే జరిగిన జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవటం, బీజేపీ పోటీ చేసి ఓటమి పాలు కావటంతో కాంగ్రేస్ మద్దతుతో మజ్లీస్ ఈ సీటును గెలిచిన తర్వాత బుధవారం జరగనున్న మొదటి కౌన్సిల్ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మజ్లీస్ పార్టీ మాత్రం వర్షకాలం సహాయక చర్యలు, నాలాల పూడికతీత పనులు, స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్, వరద నీటి కాలువలు వంటి విషయాలపై ప్రశ్నించే అవకాశమున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ప్రతి అధికారికి ఫోన్ కేటాయించి, నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఫోన్లు చేసినా ఎందుకు స్పందించటం లేదని పలువురు ప్రజాప్రతినిధులు నిలదీసే అవకాశాలున్నాయి. రెస్పాన్స్ కాని అధికారుల నుంచి జీహెచ్ఎంసీ ఫోన్లు వెనక్కి తీసుకోవాలని, దీంతో కనీసం సెల్ ఫోన్ బిల్లుల భారమైన తగ్గుతుందని పలువురు బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

బీజేపీ కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిశా నిర్దేశం

జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం బీజేపీ కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన కార్పొరేటర్లతో స్పెషల్ గా సమావేశమైనట్లు సమాచారం. కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై మంత్రి కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి ఇటీవలే చేపట్టిన బస్తీ పర్యటనలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను కౌన్సిల్ లో ప్రస్తావించాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాటు ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనా, ఇప్పటి వరకు మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు ఏర్పాటు చేయకపోవటం, టెండర్లలో వెలుగు చూసిన అక్రమాలపై అధికార పార్టీని నిలదీయాలని ఆయన సూచించినట్లు తెలిసింది. గ్రేటర్ సమస్యలపై కౌన్సిల్ లో అంశాల వారీగా కార్పొరేటర్లు ఏం మాట్లాడాలనే విషయంపై కేంద్ర మంత్రి కార్పొరేటర్లకు క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది.

Also Read: Kavitha’s Maha Dharna: రేపే కవిత మహాధర్నా.. మరి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటారా?

 

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?