Janagaon Collectorate: కలెక్టర్ గారు మాపై దయ చూపండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మాపై కనికరం చూపడం లేదంటూ ఆగ్రహించిన గుడిసె వాసులు జనగామ కలెక్టరేట్ లోనికి గుడిసెవాసులు దూసుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లింగాల గణపురం మండలం పటేల్ గూడెం గ్రామ శివారులో గత నాలుగు సంవత్సరాల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఈదురు గాలులతో చేల్లా చేదురైన గుడిసెలను సరిచేసుకుంటున్న క్రమంలో లింగాల గణపురం రెవిన్యూ పోలీసు సిబ్బంది అడ్డుకొని జాగాను ఖాళీ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారని గుడిసేవాసులు ఆరోపిస్తున్నారు. గుడిసేవాసులు, సిపిఎం నాయకులు రెవెన్యూ, పోలీసు సిబ్బంది తీరుకు నిరసనగా జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషాను కలిసి వినతి పత్రం ఇవ్వాలనుకుని కలెక్టరేట్ కు వెళ్లారు.
కలెక్టర్ అవకాశం ఇవ్వలేదు
కలెక్టర్ సమయం ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన గుడిసె వాసులు, సిపిఎం నాయకులు సుమారు నాలుగు గంటల పాటు కలెక్టరేట్ గేటు ముందు ఆందోళనకు దిగారు. కలెక్టర్ స్పందించకపోవడంతో గుడిసేవాసులు సిపిఎం నాయకులు కలెక్టరేట్ గేటును తోసుకొని కలెక్టరేట్లోకి దూసుకుపోయారు. అప్పటికే భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళనకారులు కలెక్టరేట్ నుండి బయటికి ఈడ్చుకు వెళ్ళారు. అనంతరం గుడిసె వాసుల ఆందోళన వద్దకు కలెక్టరేట్ ఏవో మనసు వచ్చి గుడిసె వాసులు ఇచ్చిన వినతి పత్రాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా గుడిసె వాసులు కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. కలెక్టర్ వ్యవహార శైలి సరిగా లేదని గత కలెక్టర్లకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
Also Read: Vem Narender Reddy: అన్ని వర్గాల సంక్షేమమే.. ప్రభుత్వ ధ్యేయం!
ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్లక్ష్యం
కలెక్టర్ భూకబ్జాదారులకు వత్తాసు పలుకుతూ పేదలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చేంతవరకు అండగా ఉంటానన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం గుడిసె వాసుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. గుడిసె వాసుల పట్ల రెవెన్యూ, పోలీసు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరికాదని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజేందర్, జోగు ప్రకాష్ పొత్కనూరి ఉపేందర్, లింగాల గణపురం మండల కార్యదర్శి బొడ్డు కర్ణాకర్, నాయకులు పాల్గొన్నారు.
Also Read: Harish Rao: బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే.. రెడ్ బుక్ లో పేర్లు నమోదు!