Vem Narender Reddy(image credit: swetcha reporter)
Uncategorized

Vem Narender Reddy: అన్ని వర్గాల సంక్షేమమే.. ప్రభుత్వ ధ్యేయం!

Vem Narender Reddy: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి సలహాదారు(ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర  అవతరణ దినోత్సవ వేడుకలకు వేం నరేందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి సారథ్యంలో జిల్లా అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. జీవన జ్యోతి మహిళ సమాఖ్యకు 80 కోట్ల 02 లక్షల 89 వేల చెక్కును, మెప్మా ద్వారా జిల్లాలోని 385 మహిళా సంఘాలకు 50 కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కును ఈ సందర్భంగా మహిళలకు అందజేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆప్యాయంగా పలుకరించి సత్కరించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు.

Also Read: KTR – Kavitha: కేటీఆర్ వస్తేనే క్లారిటీ.. కవిత ఎపిసోడ్ పై చర్చించే అవకాశం!

వివిధ పాఠశాలల నుంచి వచ్చిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశాయి. ఈ వేడుకల్లో రాష్ర్ట పట్టణ, ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఛైర్మన్‌ చల్లా నర్సింహ రెడ్డి, శాసన సభ్యులు మల్‌ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్‌, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, డిసీపీ సునీతా రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌, డీఆర్‌ఓ సంగీత, జిల్లా పరిషత్‌ సీఈఓ కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Raja Singh Threat: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రాణాలకు ముప్పు.. వరుసగా బెదిరింపు కాల్స్!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?