Warangal Commissioner: మీ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీల నియంత్రణపై ప్రతి పోలీస్ అధికారి స్పెషల్ ఫోకస్ పెట్టాలని వరంగల్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపు నిచ్చారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా ఆస్తి నేరాలపై సమీక్షా జరిపారు. ఇందులో ప్రధానంగా పెండింగ్ చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్, సోమ్ము రికవరీ, పెండింగ్ లో వున్న చోరీ కేసులు, నిందితుల అరెస్ట్ పై సీపీ సమీక్ష జరపడంతో పాటు, సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న ఇతర కేసులపై సమీక్ష జరిపడంతో పాటు పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకోని, కేసుల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
Also Read: Vijayashanti: రాములమ్మకు మంత్రి పదవి ఫిక్స్.. ఏరికోరి మరీ ఎందుకో?
పోలీస్ బేసిక్ పోలీసింగ్ పై దృష్టి
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకై సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజలను భాగస్వాములను చేయడంతో సిసి కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగహన కల్పించాలని. నేరాలకు సంబంధించి అధికారులు దర్యాప్తు సమయంలో టెక్నాలజీతో పాటు శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టాలని, చోరీలపై పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యంగా వాహనాల చోరీలకు సంబంధించి వాహనాలను ఇంటిలో పార్కింగ్ చేసుకోనే విధంగా ప్రజలకు సూచించాలని సీపీ తెలియజేసారు.
రాబోవు బక్రీద్ పండుగను దృష్టి లో పెట్టుకొని మూగజీవాల రవాణా పై ప్రత్యేక దృష్టి పెట్టడం పాటు, పండుగ వేళ దర్గాల వద్ద పతిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని. వరంగల్ కు వున్న కీర్తి ప్రతిష్టలకు తగ్గట్లుగా పోలీసింగ్ వుండాలి. ప్రతి పోలీస్ బేసిక్ పోలీసింగ్ పై దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, జనగాం ఏఎస్పీ చైతన్య, అదనపు డిసిపిలు రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.
Also Read: Kodanda Reddy: సత్వర చర్యలు తీసుకోవాలని.. అధికారులకు కోదండరెడ్డి ఆదేశం!