Crusher Mills: నిత్యం రణగొణ ధ్వనుల మద్య 24/7 సైతం నడిచే కంకర మిషన్లు ఇక మూగబోయే సమయం ఆసన్నమైంది. సామాన్యులు నిర్మించుకునే ఇళ్లకు, ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు క్రషర్ అందకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కాస్త విశ్రాంతి దొరుకుతుందా అని చూసే కూలీలు ఇప్పుడు పని లేకపోవటంతో ఉపాధి కోల్పోయి కుటుంబం భారంతో ఇబ్బందులు పడుతున్నారు. జీవనోపాధి కోసం మరెక్కడ పని చేయాలో ఆ కూలీలకు అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. మండలంలో పది కంకర క్రషర్లు ఉండగా నిత్యం భారీ యంత్రాలు పని చేస్తూ పెద్ద పెద్ద రాల్లు పిండి చేసి కంకర, డస్టుగా మారుస్తుంటాయి. కంకర డస్టుకు సైతం మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. క్రషర్లలో రోజు రూ. లక్షల్లో వ్యాపారం జరగడంతోపాటు వందల మంది కుటుంబాలకు ఉపాదిని కల్పిస్తుంది. అలాంటి క్రషర్లు ఇప్పుడు మూతపడ్డాయి. ఏ క్రషర్ వద్దకు వెళ్లిన మైనింగ్ అధికారులు మూసేయమన్నారు అనే సమాదానమిస్తున్నారు.
గతంలో లాగానే ముదిగొండ మండలంలో ప్రతి క్రషర్ వద్దకు వెళ్లిన మైనింగ్ అధికారులు క్రషర్లు ఆపాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం. క్రషర్లకు ముందస్తుగా ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండానే అన్ని క్రషర్లకు బందు చేయించారనే అరోపనలు కూడా బలంగానే వినపడుతుండడంతో రోజువారి కూలీలకు జీవనోపాధి లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మధిర నియోజకవర్గంలో ఇటీవల వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుండగా కంకర, డస్ట్ ప్రధాన ముడిసరుకు నేడు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ముదిగొండ మండలంలో అధికంగా ఉన్న కంకర క్రషర్లు కోట్ల రూపాయల ఆర్డర్లు వచ్చినట్లు సమాచారం కూడా ఉంది.
Also Read: Bhatti Vikramarka Mallu: ఆదివాసి, నిరుపేదల సంక్షేమమే.. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం !
గంతలోనూ నెల రోజులు పాటు అగిన క్రషర్లు
కూలీలకు రోజులు గడుస్తున్న క్రషర్ల నిర్వహణలపై ఎటూ తేలకపోవటంతో మేము చెప్పే వరకూ రావద్దని వర్కర్లకు క్రషర్ల నిర్వాహకులు చెప్పటంతో తమ ఉపాది ఎక్కడ పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని సుదూర ప్రాంతాలకు సైతం ఇక్కడ నుంచి కంకర, డస్ట్ తీసుకెళ్లేవారు. ప్రస్తుతం క్రషర్లు మూతపడటంతో నిర్మాణ పనులు చేస్తున్న వారూ ఇబ్బంది పడుతున్నారు. కొద్ది రోజులు ఇలా సాగితే నిర్మాణ పనులు ఆగిపోయి ఆ కార్మికులు సైతం ఉపాది కోల్పోయే ప్రమాదం ఉన్నది.
ముదిగొండ నుండి అమరావతికి వెళుతున్న క్రషర్లు
మండలంలో ఉన్న రెండు మూడు క్రషర్లు మిషనరీతో సహా అమరావతికి వెళుతున్నట్లు సమాచారం. దీంతోనే ఇక్కడ అధికారుల వత్తిళ్లు తట్టుకోలేకనే ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతికి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే సమాచారం కూడా గట్టిగానే వినిపిస్తుంది. ముదిగొండలో మొట్టమొదటి 40 సంవత్సరాలు క్రితం పెట్టిన పటేల్ కంకర క్రషర్ కూడా స్క్రాప్ కు పడేశారు. ఇన్ని సంవత్సరాలుగా మండల ప్రజలకు ఉపాధి కల్పిస్తూ నేడు మాత్రం క్రషర్ల మిషనరీ మూగబోవటంతో కూలీలు ఒక సారిగా రోడ్డున పడ్డారు.
అమాంతం పెరగనున్న కంకర ధరలు
ప్రస్తుతానికి మండల ప్రజలకు అందుబాటులో ఒక టన్ను రాక్ స్టాండ్ రూ.400/-, 40 MM మెటల్ రూ.400/-, VSI-20 MM మెటల్ రూ.500/-, VSI-10 MM మెటల్ రూ.350/-, GSB రూ. 350/- కలవు. ఇప్పుడు మండలో క్రషర్లు మూతపడ్డంతో ధరలు అమాంతం పెరగనున్నాయి. ఒక టన్నుకి రెండు, మూడు వందలు ఒకే సారి పెరుగుతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సామాన్య ప్రజలకు ఇక కంకర అందుబాటులో లేదనే చెప్పాలి.
Also Read: Botsa Satyanarayana: మహానాడు పెద్ద డ్రామా.. సీఎం ప్రసంగమంతా సొల్లే.. బొత్స ఫైర్