Bhatti Vikramarka Mallu: రాష్ట్రంలోని ఆదివాసి, గిరిజన, నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాల్వంచలో తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ కార్యకర్తల ట్రైనింగ్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కృషితోనే తెలంగాణ రాష్ట్రం వరించిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పక్కకు నెట్టి రాచరిక పాలనతో రాష్ట్రాన్నే దోచుకున్నాడని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమైంది అన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో ఎత్తేస్తామని చెప్పి అలాగే చేశామని గుర్తు చేశారు. ప్రతి సమస్యకు ప్రత్యేక పరిష్కారం మార్గం చూపేందుకే భూభారతిని తీసుకొచ్చామని వెల్లడించారు. గిరిజనుల విద్యను పెంచడం కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని పక్కాభవనాలతో నిర్మిస్తున్నామన్నారు.
Also Read: Bandi Sanjay on BRS: నిజమే.. బీఆర్ఎస్ పొత్తు కోసం వచ్చింది.. బండి సంచలన కామెంట్స్
హైదరాబాద్ వెళ్లగానే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని వెల్లడించారు. నిరుద్యోగుల సమస్య తొలగించడానికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఏకంగా దేశంలో ఎక్కడ అమలకు సాధ్యం కానీ నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.
పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంలో సబ్ ప్లాన్ నిధులు తూచా తప్పకుండా ఖర్చు చేస్తున్నామని వివరించారు. సబ్ ప్లాన్ కింద గిరిజనులకు 17,169 కోట్లు కేటాయించామని తెలిపారు. గతంలో ఖర్చు చేయని 1,296 కోట్ల నిధులు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నామని వివరించారు.
Also Read: Drugs Seized: డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్.. 3.05కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్!
ఆత్మగౌరవం, సమ సమాజం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యమని చెప్పారు. అందుకు అనుగుణంగా పథకాలు ప్రవేశపెట్టామని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏ ఇంటికి ఏ పథకాలు అందుతున్నాయి.. ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో పూర్తి వివరాలను త్వరలో ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు. నాయకులుగా సంక్షేమ పథకాల పై ప్రచారం చేయండనీ, అర్హులతో దరఖాస్తులు చేయించాలని సూచించారు. గిరిజనుల అవసరాలు ఏంటో తెలుసుకొని ఆ వర్గాల నాయకులను ఒకచోట చేర్చి ఏఐసిసి ద్వారా అమలు చేసేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.
ధరణి పేరుతో అసైన్డ్ భూములను హస్త గతం చేసుకుంటుంటే ఆందోళనలు చేశామనీ, ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం అని చెప్పి అధికారంలోకి వచ్చి భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా వెయ్యి కోట్ల నిధులు కేటాయించి దేశ చరిత్రలోనే ఇది ఓ రికార్డు సృష్టించామన్నారు. అడవి బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం తీసుకువచ్చామని తెలిపారు. 6.70 లక్షల ఎకరాలను 12,500 కోట్లు ఖర్చు చేసి సాగులోకి ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తున్నామన్నారు. గిరిజనుల హక్కులు ఆత్మగౌరవం కాపాడేందుకే నల్లమల్ల డిక్లరేషన్ తీసుకొచ్చామని తెలిపారు.
Also Read: ACB on GHMC: జీహెచ్ఎంసీ ఆఫీసులపై.. ఏసీబీ స్పెషల్ నజర్!