హైదరాబాద్

ACB on GHMC: జీహెచ్ఎంసీ ఆఫీసులపై.. ఏసీబీ స్పెషల్ నజర్!

ACB on GHMC: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలో అవినీతి రోజురోజుకి పెరిగిపోవటంతో అవినీతి నిరోధక శాఖ నజర్ వేసినట్లు విశ్వసనీయ సమాచారం. జీహెచ్ఎంసీ అవినీతికి బ్రేక్ వేసేందుకు, త్వరితగతిన సేవలందించేందుకు సర్కారు ఎన్నిసంస్కరణలు తెచ్చినా ఫలితం లేకుండా పోతుంది. కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు మొదలుకుని భవన నిర్మాణ అనుమతుల జారీ తో పాటు చివరకు బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా, చేతులు తడపడం తప్పటం లేదు. కనీసం కొత్త కమిషనర్ వచ్చారన్న భయం కూడా లేకుండా, బహిరంగంగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

భవన నిర్మాణ అనుమతి జారీ చేసేందుకు సికిందరాబాద్ జోన్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ కు చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏకంగా రూ. 8 లక్షల లంచం డిమాండ్ చేసి, అందులో రూ.4 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కటం కలకలం రేపింది. ఈ రకంగా ప్రతి జోన్, సర్కిల్ లోనూ ప్రతి సర్వీసుకు ఓ పత్ర్యేక టారీఫ్ ను అమలు చేస్తూ, ఓపెన్ గా లంచాలు, బేరసారాలు కొనసాగుతున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Swetcha Special story: చదువే జీవన గమనాన్ని మార్చుతుంది.. ఎస్పీ పై స్వేచ్ఛ ప్రత్యేక కథనం!

రెండు నెలల క్రితం అర్బన్ బయోడైవర్శిటీకి చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రూ.80 వేలు లంచం తీసుకుంటూ చిక్కగా, అంతకు ముందు శేరిలింగంపల్లి జోన్ లో మరో ఇంజనీర్ కూడా లంచాలు తీసుకుంటూ వరుసగా మూడు నెలల్లో ముగ్గురు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో పర్సెంటేజీలు చెల్లించినదే బిల్లులు చెల్లింపులు జరగటం లేదని ఇప్పటికే పలు సార్లు పలువురు కాంట్రాక్టర్లు బాహాటంగానే ఆరోపించారు. బిల్లింగ్ సెక్షన్ లోని కొందరు అధికారులైతే ముందుగానే తమ పర్సెంటేజీని వసూలు చేసుకుని, ఆ తర్వాత బిల్లుల చెల్లింపులు జరుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రధాన కార్యాలయం కన్నా జోనల్ ఆఫీసుల్లో ఎక్కువగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ సెక్షన్లలో అవినీతి జరుగుతుందన్న విషయాన్ని ఏసీబీ అధికారులు గుర్తించి, జోనల్ ఆఫీసులపైనే ఎక్కువగా నిఘా పెట్టినట్లు సమాచారం.

జీహెచ్ఎంసీ అధికారులపై ఫిర్యాదు రావటమే ఆలస్యం, ఆగమేఘాలపై ఏసీబీ అధికారులు రంగంలోకి దిగతున్నారు. ప్రధాన కార్యాలయంపై కూడా ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో పలువురు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడిన నేపథ్యంలో ప్రధాన కార్యాలయంలోని అవినీతి అధికారుల వివరాలను ఏసీబీ సేకరించినట్లు తెలిసింది. ఇటీవలీ కాలంలో శేరిలింగంపల్లిలో యూబీడీ అసిస్టెంట్, కొద్దిరోజుల క్రితం సికిందరాబాద్ జోన్ లో టౌన్ ప్లానింగ్ ఏసీపీ లంచం తీసుకుంటూ పట్టుబడటంతో సికిందరాబాద్, శేరిలింగంపల్లి జోన్ లలో ఎక్కువగా అవినీతి జరుగుతున్నట్లు ఏసీబీ నిర్థారించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ రెండు జోన్లలోని టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఏసీబీ ఎపుడైనా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశాలున్నట్లు సమాచారం.

Also Read: Drugs Seized: డ్రగ్​ పెడ్లర్ల అరెస్ట్.. 3.05కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్​!

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు