Botsa Satyanarayana: ఏపీలో అధికార టీడీపీ నిర్వహించిన మహానాడు (TDP Mahanadu) కార్యక్రమంపై మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడపలో టీడీపీ మూడు రోజులు డ్రామా చేసిందని విమర్శించారు. ఏడాది పాలనలో ఏం చేశామో చెప్పులేక టీడీపీ మూడు రోజులు అవస్థలు పడిందని ఆరోపించారు. అధికారంలో ఉండీ.. ఏం చేశారో చెప్పుకోలేకపోయారని విమర్శించారు. మహానాడు జరిగిన మూడు రోజులూ.. ఆత్మస్తుతి పరనిందలా సాగిందని చెప్పారు.
సూపర్ 6 హామీలు ఎక్కడ?
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) హామీలను ఎందుకు అమలు చేయడం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మహానాడులో దాని గురించి ఎందుకు మాట్లాడకలేకపోయారని ప్రశ్నించారు. తల్లికి వందనం (Thalliki Vandanam) నిధులను.. గత ఏడాది కలిపి ఎప్పుడు పంపిణీ చేస్తారని నిలదీశారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (AP Govt) చేసిన అభివృద్ధి ఎంటో చెప్పాలని పట్టుబట్టారు. ప్రజలకు ఉపశమనం కలిగించే ఒక్క మాటైనా ప్రజలకు మహానాడులో చెప్పారా? అంటూ సీఎం చంద్రబాబు (CM Chandrababu)ను బొత్స ప్రశ్నించారు. ఎవరెవరినో తీసుకొచ్చి అనవసర మాటలు మాట్లాడించారు తప్పా.. ప్రజలకు ఉపయోగపడే హామీ ఏమైనా ఇచ్చారా? అంటూ నిలదీశారు.
విద్యార్థుల జీవితాలతో ఆటలు
మహానాడులో సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం.. సొల్లు కబుర్లతో నిండిపోయిందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వానలు వస్తే ఏం చెయ్యాలో ముందస్తు ప్రణాళిక లేదని.. రైతుల (AP Farmers) కోసం కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవ తరగతి మూల్యంకనం (AP 10th Class Results 2025)లో చాలా తప్పులు బయటపడ్డాయన్న బొత్స.. ఫెయిల్ అయ్యామని విద్యార్థులు (AP 10th Students) ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ప్రభుత్వానికి సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం (Ex YSRCP Govt)లో ఎన్నడూ ఇలాంటి తప్పులు జరగలేదని బొత్స గుర్తుచేశారు. దీనిపై చర్చకు వచ్చేందుకు తాను సిద్ధమని సవాలు విసిరారు.
Also Read: Bandi Sanjay on BRS: నిజమే.. బీఆర్ఎస్ పొత్తు కోసం వచ్చింది.. బండి సంచలన కామెంట్స్
జూన్ 4న వెన్నుపోటు దినం
మరోవైపు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ ఎప్పుడు ఇస్తారని కూటమి ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని పట్టుబట్టారు. ప్రజలను కూటమి ప్రభుత్వ చేసిన మోసానికి గాను జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ రోజున ఎమ్మారో, ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ (AP Liquor Scam)లో అరెస్టులు చేసి ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. మీడియా ముందుకు వచ్చి జగన్ మెుత్తం వివరాలు బయటపెట్టారని పేర్కొన్నారు.