Virat on Musheer Khan (Image Source: Twitter)
స్పోర్ట్స్

Virat on Musheer Khan: ఆ క్రికెటర్‌ను అవమానిస్తావా.. బాధ్యత లేదా.. కోహ్లీపై నెట్టింట ఫైర్!

Virat on Musheer Khan: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గురువారం ఆర్సీబీ (Royal Challengers Bengaluru), పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) మధ్య క్వాలిఫయర్‌- 1 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు సత్తా చాటింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ ను మట్టికరిపించి.. 8 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగురవేసింది. తద్వారా కింగ్ కోహ్లీ (Virat Kohli) ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ జట్టు.. ఐపీఎల్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. అయితే ఇదంతా బానే ఉన్నప్పటికీ మైదానంలో కోహ్లీ చేసిన ఓ పని విమర్శలకు తావిస్తోంది.

అసలేం జరిగిందంటే?
ఆర్సీబీతో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో పంజాబ్ మెుదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 101-10 (14.1 Ov) మాత్రమే స్కోర్ చేసి ఆలౌట్ అయ్యింది. అయితే తొలి నుంచి పంజాబ్ బ్యాటర్లపై ఆర్సీబీ బౌలర్లు ఆదిపత్యం చెలాయించారు. ఈ క్రమంలోనే 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఏడో బ్యాటర్ గా పంజాబ్ కింగ్స్ తరపున సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) సోదరుడు ముషీర్ ఖాన్ (Musheer Khan) బ్యాటింగ్ వచ్చాడు. అప్పుడు ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ.. ముషీర్ ఖాన్ ను ఉద్దేశించి వాటర్ బాయ్ (Water Boy) అంటూ కామెంట్ చేశాడు. విరాట్‌ కోహ్లీ చేసిన ఈ స్లెడ్జింగ్‌ (Virat Kohli Sledging)కు సంబంధించిన క్లిప్‌ సోషల్‌ మీడియా (Social Media Viral Media)లో వైరల్‌గా మారింది.

నెటిజన్లు ఫైర్..!
కోహ్లీ స్లెడ్జింగ్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ (Cricket Fans) మండిపడుతున్నారు. యంగ్ ప్లేయర్ల (Young Cricket Players)ను ప్రోత్సాహించాల్సింది పోయి.. ఇలా స్లెడ్జింగ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. నయా క్రికెడ్ గాడ్ గా పేరొందిన కోహ్లీ నుంచి ఇలాంటి ప్రవర్తన అసలు ఊహించలేదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా కోహ్లీ జాగ్రత్త పడితే మంచిదని సూచిస్తున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం.. కోహ్లీకి అండగా నిలుస్తున్నారు. కోహ్లీ చాలా ఫన్నీగా ఆ వాటర్ బాయ్ అన్నట్లు సైగ చేశారని చెబుతున్నారు. దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Yeleti Maheshwar Reddy: కవిత ఎదగడం కేటీఆర్‌కు ఇష్టం లేదు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి!

సగం కెప్టెన్సీ కోహ్లీదే!
నిన్న రాత్రి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ (RCB) తరపున విరాట్ కోహ్లీ చాలా కీలకంగా వ్యవహరించాడు. పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చాలా చురుగ్గా వ్యవహించాడు. పంజాబ్ వికెట్లు క్రమం తప్పకుండా పడుతున్న క్రమంలో కొత్త బ్యాటర్ ఎలా పెవిలియన్ కు చేర్చాలో బౌలర్లకు సలహా ఇచ్చాడు. నిన్నటి మ్యాచ్ లో కీలకంగా వ్యవహించిన సుయాశ్ శర్మ (Suyash Sharma)ను కోహ్లీ బాగా ప్రోత్సహించడం గమనార్హం. అతడు తడబడిన ప్రతీసారి దగ్గరకు వెళ్లి మరి అతడిలో ధైర్యం నిలిపాడు.

Also Read This: Jurala Project: జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద.. 12 గేట్లను ఎత్తివేత!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు