Jurala Project (imagecredit:twitter)
తెలంగాణ

Jurala Project: జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద.. 12 గేట్లను ఎత్తివేత!

Jurala Project: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనీ జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 1 లక్ష క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టులో 12 గేట్లను ఎత్తి 82 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్ లాంటి డ్యామ్ ల ద్వారా నీటిని వదలకుండానే, కురుస్తున్న వర్షాలతో సహజంగా నదిలోకి చేరుతున్న నీరు ఇదీ మే నెలలో భారీ ఎత్తున వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇన్ ఫ్లో 96 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 82 వేల క్యూసెక్కులు నీరు వదులుతున్నారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

నిల్వ సామర్థం 9.657 టీఎంసీలు

కృష్ణమ్మకు ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. ఎగువనుంచి 97 క్యూసెక్కుల వరదవస్తుండటంతో ప్రాజెక్టు 10 గేట్లను అధికారులు తెరిచారు. దిగువకు 90,394 క్యూసెక్కులను శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 9.657 టీఎంసీలు కాగా, ఇప్పుడు ప్రస్థుతం 7.740 టీఎంసీలు ఉన్నాయి. జూరాల నిటీమట్టం 318.51 మీటర్లు. ప్రస్తుతం 317.55 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది.

Also Read: MLC Kavitha: సింగరేణి సాక్షిగా కొత్త పార్టీ.. కవిత మాస్టర్ ప్లాన్ భేష్.. వర్కౌట్ అయ్యేనా?

మూడవ పెద్ద నది

భారతదేశంలో మూడవ పెద్ద నది, దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది అయిన కృష్ణా నదిని తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున చిన్న ధారగా జన్మించిన కృష్ణానది ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

Also Read: Megastar Chiranjeevi: ‘గద్దర్ అవార్డ్స్’.. ఎవరి పేరు మెన్షన్ చేయాలో చిరుకి తెలియదా?

 

 

Just In

01

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచన వ్యాక్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?