MLC Kavitha (Image Source: Twitter)
తెలంగాణ

MLC Kavitha: సింగరేణి సాక్షిగా కొత్త పార్టీ.. కవిత మాస్టర్ ప్లాన్ భేష్.. వర్కౌట్ అయ్యేనా?

MLC Kavitha: బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖతో ఆ పార్టీ ముఖ్యనేత కవిత.. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలే సృష్టించారు. అంతే కాదు ఆమె త్వరలో బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి.. కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా సింగరేణి జాగృతి సంఘాన్ని కవిత ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ ఏర్పాటుకు ముందడు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదినుంచీ తనకు కలిసి వచ్చిన సింగరేణి ప్రాంతం నుంచే తన కొత్త పార్టీ అడుగులకు శ్రీకారం చుట్టారని అభిప్రాయపడుతున్నారు.

ప్రతిపక్షాలు కార్నర్
కుటుంబ పార్టీలు అనగానే వారసత్వ రాజకీయాలే గుర్తుకు వస్తాయి. అదే సమయంలో పదవుల కోసం వారసుల మధ్య కొట్లాట కూడా సర్వ సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. కేసీఆర్ కుటుంబంలోనూ అదే జరిగింది. ఈ క్రమంలోనే గత నెల ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విషయంలో నెగటివ్ పాయింట్సే లీడ్ గా… తన తండ్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం.. అది చాలారోజుల తర్వాత బయటకు లీక్ కావడంతో తెలంగాణా రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరతీసింది. దానిపై తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, కవితకు సోదరుడైన కేటీఆర్ తో పాటు.. పలువురు నేతలు కూడా పలు రకాలు వివరణలివ్వడంతో పాటు.. ప్రతిపక్షపార్టీలు కూడా అడ్వంటేజ్ తీసుకుని బీఆర్ఎస్ ను కార్నర్ చేశాయి.

కవిత ఏం చేయబోతోంది!
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కవిత కొత్త పార్టీవైపు మొగ్గు చూపుతోందనే ప్రచారమూ ముమ్మురమైంది. ఇదే సమయంలో కవిత తనకు ఆది నుంచీ పట్టున్న సింగరేణిపై దృష్టి సారించడం.. నిన్న సింగరేణి కార్మికసంఘ నేతలతో హైదరాబాద్ లో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి, కోఆర్డినేటర్లను కూడా నియమించడంతో ఇప్పుడు కవిత ఏం చేయబోతోందనే చర్చతో ఊపందుకుంది. తన కొత్త పార్టీకి సింగరేణి జాగృతి సంఘం మొదటి అడుగు కాబోతుందాననే చర్చ విస్తృతంగా జనంలోకి వెళ్లింది.

కొత్తగా పార్టీ వైపు అడుగులు!
అయితే, ఇప్పటికే బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అనుబంధంగానే సింగరేణి జాగృతి కూడా పనిచేస్తుందని కవిత ప్రకటించారు. అయినా ఇంత అత్యవసరంగా సంఘాన్ని స్థాపించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. గతంలో రెండుసార్లు అధికారిక గుర్తింపు సంఘంగా కూడా టీబీజీకేఎస్ పనిచేసిన నేపథ్యంలో.. ఇంతకాలం లేనిది ఇప్పుడే టీబీజీకేఎస్ కు అనుబంధంగా ఇంకో సంఘం ఆవిర్భావమెంతవరకూ అవసరమన్న చర్చకు ఆస్కారం కవిత కల్పించారు. దీంతో మెల్లిమెల్లిగా కవిత తన కొత్త పార్టీ వైపు అడుగులేస్తోందని.. అందులో భాగంగానే మొట్టమొదట తనకు విశ్వాసమున్న సింగరేణి వైపు దృష్టి సారించారని నిపుణులు భావిస్తున్నారు.

సింగరేణి జాగృతితో ట్రెయిల్స్!
తొలుత సింగరేణి ద్వారా వేసే అడుగుల్లో తనకు లభించే విజయాలు, ఎదురయ్యే సవాళ్లను లెక్కల వేసుకోవాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. వాటిని బేరిజు వేసుకొని వెనువెంటనే పార్టీని ప్రకటించే అవకాశముంటుందనే వాదన వినిపిస్తోంది. మొత్తంగా పార్టీ పెట్టడమా? ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్టుగా ఏదైనా జాతీయ పార్టీ వైపు చూడటమా? లేక బీఆర్ఎస్ లోనే కొనసాగడమా? అనే అన్ని అంశాలకు సింగరేణి జాగృతి ద్వారా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆ పరిణామాలే తనకు ఉపయోగపడతాయన్న ధీమాతోనే మొట్టమొదట సింగరేణి నుంచి తన పార్టీ ఆపరేషన్ ను ప్రారంభించినట్టుగా ఒక కొత్త ప్రచారానికి తెరలేచింది.

Also Read: Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఆ దెయ్యాలు ఎవరో క్లారిటీ వచ్చేనా!
కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన కామెంట్స్ తో ఆ దెయ్యాలెవ్వరన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో కవిత తీసుకుంటున్న కొత్త కొత్త స్టెప్ట్స్ ఇప్పుడు అంతర్గతంగా బీఆర్ఎస్ కే ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని కళ్లముందుంచుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు తమ దేవుడు కేసీఆర్ అంటూనే.. ఇంకోవైపు పార్టీలో కీలకంగా ఉన్నవారిని పెద్దగా పట్టించుకోకుండా.. పైగా, తన శైలిలో తాను తీసుకుంటున్న కొత్త కొత్త నిర్ణయాలు చూస్తుంటే.. వేరు కుంపటి తప్పదా అనే భావనతో పాటు.. అందుకు సింగరేణి జాగృతి మొదటి అడుగు అనే ప్రచారమూ ఇప్పుడు ఊపందుకుంది.

Also Read This: Pawan Kalyan – Chandrababu: చంద్రబాబుపై పవన్ పొగడ్తల వర్షం.. మామూల్గా ఆకాశానికెత్తలేదు భయ్యా!

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు