YSRCP: వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ మోహన్‌కు (Vallabhaneni Vamsi Mohan) బెయిల్ వచ్చింది. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం రిలీజ్ కాబోతున్నారు. ఆ తర్వాత ఆయన్ను ఆరోగ్య రీత్యా ప్రైవైట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడానికి కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. అరెస్ట్ అయినప్పట్నుంచి వంశీ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? అనే విషయాలన్నీ కోర్టుకు వచ్చి వెళ్తున్నప్పుడు ఫొటోలు చూసిన వైసీపీ శ్రేణులు, అభిమానులు చలించిపోయారు. టీడీపీ శ్రేణులేమో ‘అనుభవించాల్సిందే’ అని గట్టిగానే చెబుతున్న పరిస్థితి. అంతేకాదు.. ఇప్పుడు బెయిల్‌పై రిలీజ్ అవుతుండగా అబ్బే అప్పుడేనా?, పోనీలే ఇప్పటికైనా తెలిసొచ్చింది అని చిత్రవిచిత్రాలుగా టీడీపీ కార్యకర్తలు, వీరాభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అప్పట్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ‘వంశీ అందగాడు’ మాటను సైతం టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తూ ‘వావ్.. ఎంత అందగాడబ్బా’ అంటూ ఇలా అయ్యాడు ఎందుకనీ? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. వంశీ బయటికొస్తారు సరే.. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు? నెక్స్ట్ ఎవరి వంతు? అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తున్నది.
Read Also- Vallabhaneni Vamsi: వంశీకి హైకోర్టు బెయిల్.. కాసేపట్లో విడుదల
ఈ ఇద్దరిలో ఎవరో..?
వాస్తవానికి.. రెడ్ బుక్కులో చాలా మంది మాజీ మంత్రులు పేర్లు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యమే. అందులో ఎక్కువగా వినిపించింది మాజీ మంత్రులు కొడాలి నాని (Kodali Nani), రోజా సెల్వమణితో (Roja Selvamani) మరో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. దీంతో వంశీ తర్వాత అరెస్ట్ అయ్యేదెవరు? జైల్లో ఊచలు లెక్కెట్టబోయేది ఎవరు? అనేదానిపై టీడీపీలో, వైసీపీలో చర్చించుకుంటున్నారు. రోజా, నాని ఇద్దరిపైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. నానిపైన ఉన్న కేసులు, అక్రమాలు, అవినీతి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గడ్డం గ్యాంగ్ పేరుతో ఆక్రమణలు, భూ వివాదాలు, మట్టి, ఇసుక అక్రమ రవాణా ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్నే ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ అవకతవకలపై ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరుపుతున్నది. పొరపాటున కొడాలిని అరెస్ట్ చేస్తే కచ్చితంగా వరుస కేసులు తోడవుతాయి.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. వీటన్నింటికీ మించి.. వైసీపీ అధికారంలో ఉండగా.. కొడాలి నాని ఎంతలా విర్రవీగారో.. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh) ఇంకా టీడీపీ నేతలపై ఏ రేంజిలో పచ్చి బూతుల వర్షం కురిపించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏదో ఒక్క కేసులో నాని అరెస్ట్ అయితే, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయో? వైసీపీ అండ్ కో కలలో కూడా ఊహించలేదని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read Also- Kodali Nani: వంశీని చూసి కొడాలి నాని భయపడ్డారా..?
రోజా పరిస్థితేంటి..?
మంత్రిగా పనిచేసినప్పుడు క్రీడలు, టూరిజం పేరుతో తినేసిన కోట్ల రూపాయలపై త్వరలోనే లెక్క తేల్చడానికి కూటమి సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. అంతేకాదు, రోజాతో పాటు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పలువురు మంత్రులు, శాప్ చైర్మన్‌లు బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు. కబడ్డీ అసోసియేషన్‌లో రాజకీయాలు, నిధులు దుర్వినియోగంపై కూడా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. దీంతోపాటు ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతోనూ మాజీ మంత్రి రోజా రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఎప్పట్నుంచో ఆరోపిస్తూ వస్తున్నారు. క్రీడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గతంలో మాట్లాడుతూ 47 రోజుల్లో రూ.119.19 కోట్ల రూపాయలు వృథా చేశారని, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి భరతం కూడా పడతామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇవన్నీ విచారణ దశలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఒకవేళ నిజమే అని తేలితే మాత్రం రోజా పక్కాగా అరెస్ట్ అవుతారని తెలుస్తున్నది.
Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!
హింట్ లిస్టులో వైఎస్ జగన్..?
రోజా, కొడాలితో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పేరు కూడా టీడీపీ హింట్ లిస్టులో ఎక్కువగా వినిపిస్తోంది. తరుచూ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల నోట ఈ మాట వినిపిస్తూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) ఇప్పటికే పెద్ద తలకాలయలను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అరెస్ట్ చేయగా, అయితే ఇక మిగిలున్నది ఇద్దరే. అందులో ఒకరు ఎంపీ మిథున్ రెడ్డి, ఇంకొకరు వైఎస్ జగన్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇన్నాళ్లు జగన్‌కు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్‌తో అధినేత అరెస్ట్ ఖాయం అని.. నెక్స్ట్ వైఎస్ జగన్ వంతేనని వైసీపీ నేతలు, కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఈ మధ్యనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు.. గవర్నర్‌ను కలవడం, రెండ్రోజుల వ్యవధిలోనే మంత్రి నారా లోకేష్ కూడా ప్రధాని మోదీని ఢిల్లీకి వెళ్లి మరీ కలవడంతో ఈ అరెస్ట్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. దీంతో ఏ క్షణమైనా జగన్‌ను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చూస్తే.. నెక్స్ట్ లిస్టులో వైఎస్ జగన్, రోజా, కొడాలి నాని ఉన్నారు. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో..? ఇప్పుడు వంశీ పరిస్థితి చూసిన తర్వాత.. ఈ ముగ్గురిలో ఎవరైనా అరెస్ట్ అయితే ఎలా తిరిగొస్తారో కూడా తెలియని పరిస్థితి అని సొంత పార్టీలోనే చర్చించుకుంటున్నారు. ఎప్పుండేం జరుగుతుందో..? ఎవరి వంతు వస్తుందో..? ఏంటో చూడాలి.
Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?