Kodali Nani America
ఆంధ్రప్రదేశ్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Kodali Nani: వంశీని చూసి కొడాలి నాని భయపడ్డారా.. వైద్యులే చెప్పారా?

Kodali Nani: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) జైలుపాలై నానా అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో కేసులో బెయిల్ వస్తున్నప్పటికీ మరో కేసు తోడవుతున్నది. దీంతో వరుస కేసులతో సతమతం అవుతున్నారు. ఇప్పటి వరకూ ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో.. ఆఖరికి టీడీపీ కార్యాలయం దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుల్లోనూ బెయిల్ వచ్చింది.. ఇక రిలీజ్ మాత్రమే మిగిలి ఉందనుకునే సమయానికి నకీల ఇళ్ల పట్టాల కేసు నమోదు కావడం, రోజు వ్యవధిలోనే రిమాండ్‌కు తీసుకోవడంతో అసలు ఈ కేసు ఎప్పుడు ముగుస్తుందో, బెయిల్ ఎప్పుడు వస్తుందో? ఏంటో? అర్థంకాక కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వంశీ ఆరోగ్యం క్షీణిస్తుండటం, కోర్టుకు వస్తున్నప్పుడు.. వెళ్తున్నప్పుడు విజువల్స్, ఫొటోలు చూసిన వంశీ ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి కొడాలి నాని భయపడినట్లుగా తెలుస్తున్నది. ఆ పరిస్థితి తనకు ఎక్కడ వస్తుందో అని కంగారుపడుతున్నారట.


 

Kodali Nani And Vamsi
Read Also- Kandula Durgesh: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాటలో మంత్రి కందుల దుర్గేష్!

దొరికితే.. అంతేనా?
వాస్తవానికి.. కొడాలిపైనా చాలానే కేసులు ఉన్నాయి. గడ్డం గ్యాంగ్ పేరుతో ఆక్రమణలు, భూ వివాదాలు, మట్టి, ఇసుక అక్రమ రవాణా ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్నే ఉన్నాయి. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ అవకతవకలపై ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం విచారణ జరుపుతున్నది. పొరపాటున కొడాలిని అరెస్ట్ చేస్తే కచ్చితంగా వరుస కేసులు తోడవుతాయి.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే వైసీపీ హయాంలో కొడాలి నాని ఎంతలా విర్రవీగారో.. చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్‌ (Nara Lokesh) ఇంకా టీడీపీ నేతలపై ఏ రేంజిలో పచ్చి బూతుల వర్షం కురిపించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఏదో ఒక్క కేసులో నాని అరెస్ట్ అయితే, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు ఎలా ఉంటాయో? వైసీపీ అండ్ కో కలలో కూడా ఊహించలేదేమో. మరోవైపు నాని ఎప్పుడెప్పుడు దొరుకుతారా? అని టీడీపీ పెద్దలు వేయి కళ్లతో ఎదురుచూపుల్లో ఉన్నారు. కొడాలి అనారోగ్యానికి గురవ్వడం, బైపాస్ సర్జరీ చేయడంతో ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. ఇంకా చెప్పాలంటే ఇదొక బిగ్ రిలీఫ్ అనే వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.


Jagan And Kodali Nani

Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!

చికిత్స కోసమా?.. భయపడ్డారా..?
గత రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో నానిపై పెద్ద చర్చే జరుగుతున్నది. ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. మూడు నెలలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని నానికి సూచించారు. అయితే బైపాస్ సర్జరీ చేసినప్పటికీ ఆరోగ్యం సెట్ కాలేదని తెలిసింది. అందుకే మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లాలని ముంబై వైద్యులు సూచించినట్లుగా తెలుస్తున్నది. సర్జరీ కోసం మొదటే అమెరికా వెళ్లాలని భావించినప్పటికీ, హెల్త్ ఎమర్జెన్సీ కావడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ముంబైలోనే సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు తప్పనిసరి అమెరికా వెళ్లాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. అమెరికా వెళ్లి మెరుగైన చికిత్స తీసుకొని.. అంతా ఓకే అనుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కొడాలి నాని, ఆయన కుటుంబీకులు భావిస్తున్నారట. ఒకట్రెండు రోజుల్లో ముంబై నుంచి అమెరికాకు పయనం కానున్నట్లు సమాచారం. అయితే ఆయనంటే పడని వాళ్లు, కొందరు టీడీపీ కార్యకర్తలు మాత్రం వంశీ పరిస్థితి చూసి భయపడ్డారని, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఆంధ్రాలో అడుగుపెట్టకూడదని నాని భావించారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏది నిజమో..? ఏది అబద్ధమో తెలియక కొడాలి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు. ఈ విషయంపై ఆయన కుటంబ సభ్యులు లేదా గుడివాడకు చెందిన వైసీపీ నేతలు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Kodali Nani

Read Also- Big Breaking: తెలంగాణలో మందుబాబులకు ఉహించని షాక్.. అంతా గందరగోళం

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?