MLA Nayini Rajender Reddy: వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రిలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అకస్మిక తనికి చేశారు. ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది యొక్క నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అనుమతిలేకుండా 77 మంది విధులకు గైర్హాజరవడంతో వరంగల్ కలెక్టర్‌తో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సూపరిండెంట్ కిషోర్ 77 మందికి మెమోలు జారీ చేశారు.
ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల్లోని పేదలకు వైద్య సేవలు అందించే వరంగల్ ఏంజిఏం ఆస్పత్రి నిర్లక్ష్యానికి అడ్డగా మారింది. విధులు నిరక్ష్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారి ఆటకట్టించేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద శ్రీకారం చుట్టారు. విధులు నిర్లక్ష్యం చేసిన ఉద్యోగులను తీరు మార్చుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ గతంలో అనేకసార్లు ఆదేశించిన వారి తీరు మారలేదు. తీరు మార్చుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ అనుమతులు లేకుండా విధులకు హాజరు కాకపోవడం లాంటి చర్యలకు పాల్పడిన 77 మందికి జిల్లా కలెక్టర్ మెమోలు జారీకి ఆదేశాలు జారీ చేశారు. ఎంజీఎం వైద్యులు, ఉద్యోగులపై కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు.
Also Read: Fake Forest Officer: గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో మోసం.. నకిలీ అటవీ అధికారి అరెస్టు!
ఆకస్మిక తనిఖీ
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఎంజీఎంను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో వైద్యులు విధులకు హాజరుకాకపోవడం, శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతో ఆగ్రహం వారు వ్యక్తం చేశారు. ఆ సమయంలో కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి వీధుల పట్ల అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విధులకు హాజరు కాని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగుల నుంచి సంజాయిషీ కోరుతూ మెమోలు జారీ చేయాలని ఎంజీఎం సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ ప్రాథమిక విచారణ జరిపి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులు 72 మంది, ఉద్యోగులు 5గురి మెమోలు జారీ చేశారు.
ఒకే రోజు 77 మందికి మెమోలు
ఈ ఘటన ఎంజీఎం చరిత్రలో ఓ ఒక్క రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు 77 మందికి మెమోలు జారీ చేయడం ఇప్పటి వరకు జరగలేదని, ఇంత మందిపై చర్యలు తీసుకోవడం ఇదే ప్రథమమని ఎంజీఎం ఉద్యోగులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. మెమోలు జారీ చేసి వదిలేయకుండా పేద ప్రజలకు వైద్యం అందించి వరంగల్ ఎంజీఎం ప్రక్షాళన చేసేంతవరకు ఇదే పట్టుదలతో వ్యవహరించాలని రోగులు రోగుల బంధువులు కోరుతున్నారు.
Also Read: Minister Seethaka: ట్రాన్స్ జెండర్లకు అవకాశాలపై.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు!